Payyavula Keshav( image credit: twitter)
అనంతపురం

Payyavula Keshav: జగన్ కి భయం పట్టేసింది.. మంత్రి సంచలన కామెంట్స్!

Payyavula Keshav: రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి జగన్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి విషయానికి వచ్చేసరికి, అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయని మంత్రి ఆరోపించారు. జగన్ గారి మాటలు పరిశ్రమలు రావొద్దనే ఉద్దేశంతో ఉన్నట్లుగా అనిపిస్తోంది అని అన్నారు.

లిక్కర్ పాలసీ అక్రమంగా ఉందని జగన్ ఆరోపిస్తున్నదే కానీ, అదే పాలసీ ఆయన నాన్న రాజశేఖర్ రెడ్డి హయాంలో అమలులో ఉందన్నారు. “అప్పుడు స్కాం కనపడలేదా?” అని కేశవ ప్రశ్నించారు. మా పాలనలో ప్రజలకు ఉచితంగా ఇసుక అందించాం. కానీ మీ పాలనలో గ్రామ స్థాయి నుంచి తాడేపల్లి వరకు కప్పం కట్టారు, అంటూ వైసీపీ హయాంలో చోటుచేసుకున్న స్కాంలను మంత్రి గుర్తు చేశారు.

 Also Read: YS Jagan: లిక్కర్ స్కామ్‌పై కుండబద్దలు కొట్టిన జగన్.. విజయసాయిరెడ్డిపై సంచలన ఆరోపణలు!

ల్యాండ్ మైండ్, సాండ్, వైన్ స్కాంలన్నీ జగన్ పాలనలోనే జరిగాయని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ తో పోలవరం ప్రాజెక్ట్ ఖర్చు మూడింతలైంది అని విమర్శించారు. అభివృద్ధికి బదులు ఆటంకాలు తేవడమే జగన్ ఉద్దేశమని అభిప్రాయపడ్డారు. విశాఖను నాశనం చేశారు. పరిశ్రమలను తరిమేశారు,” అని తీవ్రస్థాయిలో విమర్శించారు. రూ.9,600 కోట్ల పరిశ్రమలకు ప్రోత్సాహక బకాయిలు ఉండటం దుర్మార్గమన్నారు.

గత ఐదేళ్లలో 10 లక్షల కోట్లకు పైగా అప్పు చేసి, రూ. 3.5 లక్షల కోట్ల బిల్లులను పెండింగ్ లో పెట్టారని విమర్శించారు. మీరు చేసిన అప్పులకి ఇప్పుడు వడ్డీ కట్టేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, అన్నారు. వైసీపీ పాలనలో లక్షల మంది విద్యార్థులు పాఠశాలలు మానేశారని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకే ముప్పుగా నిలుస్తుందని హెచ్చరించారు. మీరు తెరపైకి వస్తే మళ్లీ మీ అక్రమాలు, దోపిడీలు గుర్తుకువస్తాయి, అంటూ మంత్రి ఘాటు హెచ్చరికలు  చేశారు.

 Also Read: KTR on CM Revanth: సీఎం రేవంత్‌కు ఆ వ్యాధి ఉంది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!