శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలోని కియా పరిశ్రమలో 900 ఇంజన్ల చోరీపై పోలీసులు పురోగతి సాధించారు. విచారణలో భాగంగా మీడియాకు ఉన్నతాధికారులు వివరాలు వెల్లడించారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి తీసుకొచ్చే క్రమంలోనే దొంగతనం జరిగిందని పోలీసులు తేల్చారు. అయితే ఇందులో బయటివాళ్ల ప్రమేయం లేదని, కంపెనీ సిబ్బంది లేదా మాజీ ఉద్యోగుల హస్తం ఉందని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు? సూత్రధారులు ఎవరు? పాత్రధారులు ఎవరనేది దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కొన్ని అవకతవకలను, రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు మీడియాకు వివరించారు.
Also read: Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఆ ఏరియాలకు కొత్తగా మెట్రో సేవలు!
కంపెనీ లోపలి నుంచి చిన్న వస్తువును కూడా తీసుకురావడం సాధ్యం కాదని, దర్యాప్తులో భాగంగా రిటైర్ అయిన ఉద్యోగులను, ప్రస్తుతం పని చేస్తున్న వారిని కూడా ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. కాగా, కియా పరిశ్రమకు కంటైనర్ల ద్వారా కార్ల ఇంజిన్లు, విడిభాగాలు, పరికరాలు 25 కియా అనుబంధ పరిశ్రమల నుంచి వస్తుంటాయి. ఈ క్రమంలోనే చోరీ జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.