L2 Empuraan: మెగాస్టార్ మోహన్‌లాల్ (Mohanlal), టాలెంటెడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)ల బ్లాక్‌బస్టర్ కాంబో చిత్రం ‘L2E ఎంపురాన్’ మార్చి 27న విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. 2019లో ఈ ఇద్దరూ కలిసి చేసిన ‘లూసిఫర్’ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ కూడా చేశారు. ఇప్పుడా ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటోన్న ‘L2E ఎంపురాన్’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌ని వెరైటీగా చిత్రయూనిట్ స్టార్ చేసింది. కొన్ని రోజులుగా సినిమాలోని ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ వస్తున్న మేకర్స్ ఇప్పుడూ బిగ్ అప్డేట్‌ని ఇచ్చారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు జెరోమ్ ఫ్లిన్ ఈ సినిమాలో బోరిస్ ఆలివర్ అనే కీలక పాత్రను పోషించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఐకానిక్ వెబ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో బ్రోన్ పాత్రను చేసిన జెరోమ్ ఫ్లిన్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి గుర్తింపు ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ‘జాన్ విక్ చాప్టర్ 3, సోల్జర్ సోల్జర్, బ్లాక్ మిర్రర్’ వంటి అనేక ప్రాజెక్ట్స్‌లో చేసిన జెరోమ్ ఫ్లిన్ ఇప్పుడు ‘L2E ఎంపురాన్’ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించారు.
Also Read- Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’.. ‘కొల్లగొట్టినాదిరో’ పాట ఎలా ఉందంటే..
‘L2E ఎంపురాన్’లో నటించడంపై జెరోమ్ ఫ్లిన్ మాట్లాడుతూ.. ‘నేను ఈ ప్రాజెక్టులోకి ఎలా వచ్చానో నాకు అస్సలు గుర్తులేదు. కానీ నేను యూకే, యూఎస్‌లో గడిపిన దానికంటే పూర్తిగా భిన్నమైన అనుభవాన్ని ఈ సినిమా షూటింగ్‌లో పొందాను. మాలీవుడ్ కల్చర్‌లో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. మాలీవుడ్ సంస్కృతిలో భాగం కావడం, ఇక్కడి రుచుల్ని ఆస్వాదించడం ఎంతో ప్రత్యేకమైంది. దీనిని ఎప్పటికీ మరిచిపోలేను. నాకు ఇండియాతో ఎంతో అనుబంధం ఉంది. నా యంగ్ ఏజ్‌లో నేను ఎక్కువగా ఇక్కడి ఆధ్యాత్మిక ప్రదేశాల్ని తిరిగాను. ఇండియాలో గడిపిన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఈ సినిమాలో నటించడంతో మళ్లీ నేను నా ఇంటికి వచ్చినట్టు అనిపించిందని అన్నారు.
ఇంకా ‘L2E ఎంపురాన్’లో తన పాత్ర గురించి చెప్పకుండా, ఖురేషి ప్రయాణంలో తనది ఒక ముఖ్యమైన పాత్ర అని, ప్రేక్షకులు ఆ పాత్రను ఇష్టపడతారని ఆశిస్తున్నట్లు జెరోమ్ ఫ్లిన్ చెప్పుకొచ్చారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ‘L2E ఎంపురాన్’లో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఇంద్రజిత్ సుకుమారన్, టోవినో థామస్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయి కుమార్, బైజు సంతోష్ వంటి ప్రముఖ నటీనటులు నటించారు. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్‌పై ఈ చిత్రాన్ని సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్ నిర్మించారు. GKM తమిళ్ కుమరన్ లైకా ప్రొడక్షన్స్ హెడ్‌గా పని చేశారు. దీపక్ దేవ్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న ఈ చిత్రం 27 మార్చి, 2025న మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకానుంది.