ayyanna-patrudu
ఆంధ్రప్రదేశ్

AP Assembly: వైసీపీ తీరు బాధాకరం.. స్పీకర్ అయ్యన్న గరంగరం

AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తొలిరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) ప్రసంగిస్తున్న సమయంలో, చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వచ్చిన వైసీపీ సభ్యులు నానా రచ్చ చేశారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపివేశారు. ఆయన మాట్లాడుతున్న సమయంలోనే వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వైసీపీ (YCP) సభ్యుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కూటమి నేతలు ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని విమర్శలు చేస్తున్నారు. ఇదే క్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) స్పందించారు.

చాలా బాధాకరం

గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు పోడియం దగ్గరకు వచ్చి అరుస్తూ, ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం బాధాకరమని అన్నారు. అసెంబ్లీలో జరిగిన ఈ సంఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గౌరవ గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఇలా వ్యవహరించడం సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విషయమని వ్యాఖ్యానించారు. శాసనసభ ప్రజాస్వామ్యంలో ఉన్నతమైన వేదికగా, అతిథిగా ఆహ్వానించిన గవర్నర్‌కి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత సభ్యులందరిదకీ ఉందని గుర్తు చేశారు.

జగన్ చర్యలు మంచిది కాదు

ఒక ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన జగన్, సభ్యత మర్చిపోయి ప్రవర్తించడం బాధాకరమని స్పీకర్ అభిప్రాయపడ్డారు. ప్లకార్డులు పట్టుకొని పోడియం దగ్గర కాగితాలు చింపి విసరడం, ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిని అవమానించేలా ప్రవర్తించడం సాంప్రదాయ విరుద్ధమని అసహనం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదని, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తప్పును తప్పు అని చెప్పకుండా, వారిని ప్రోత్సహించడం ఏమాత్రం మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజుల్లో జరగకుండా చూడాల్సిన బాధ్యత సభ్యులందరిదని సూచనలు చేశారు.

ఇప్పటికైనా సభ్యులు మారాలి

అసెంబ్లీలోని సభ్యులు ఇప్పటికైనా విజ్ఞతగా, రాజ్యాంగం అనుగుణంగా ప్రవర్తించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు హితవు పలికారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు. ఇదే సందర్భంలో, అసత్య ప్రచారంపై కూడా స్పందిస్తూ, జరగని శిక్షణా తరగతులకు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని ప్రచారం చేయడం దురదృష్టకరమని అన్నారు. జగన్‌కు చెందిన పత్రికలో ప్రచురించిన అసత్య వార్తపై సభా హక్కుల కమిటీ విచారణ జరిపి, తగిన చర్యలు తీసుసుకుంటుందని స్పష్టం చేశారు. రెండు రోజుల పాటు శాసనసభ సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహించేందుకు పార్లమెంట్ స్పీకర్ ముఖ్య అతిథిగా రావాల్సి ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసిన విషయాన్ని గుర్తు చేశారు. పార్లమెంట్ స్పీకర్ తన సొంత డబ్బుతోనే విమాన టికెట్ కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తప్పుడు ప్రచారంపై సభా హక్కుల కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.

Read Also: Future city: అదిరేలా ఫ్యూచర్ సిటీ ప్లాన్.. 8 మండలాలు, 70 గ్రామాలు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు