Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పేరు వినగానే అభిమానుల్లో ఉత్సహం వస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. జీవితంలో ఆయనతో ఒక్కసారైన ఫోటో దిగాలని ఎంతో మంది అనుకుంటారు. అయితే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అక్కడ సెట్ కాకపోవడంతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. హిట్, ప్లాఫ్ అనే సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్నారు. మెగాస్టార్ ఇటీవల నటించిన వాల్తేరు వీరయ్య మూవీ మంచి హిట్‌ని సొంతం చేసుకుంది. ఇందులో రవితేజ ముఖ్యమైన పాత్రలో నటించారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం విశ్వంభర అనే చిత్రంలో చిరూ నటిస్తున్నారు. బింబిసార సినిమాతో డైరెక్టర్‌గా మొదటి హిట్ అందుకున్న వశిష్ట.. ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మరో కథానాయికగా ఆషికా రంగనాథ్‌ని కూడా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆఫీసియల్‌గా మాత్రం అనౌన్స్‌మెంట్ చేయలేదు. అంజి తరువాత మెగాస్టార్ చేస్తున్న గ్రాఫిక్స్ మూవీ ఇదే కావడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్స్ అందరిని ఆకట్టుకున్నాయి.
Also Read: ‘మజాకా’ను అందుకే మెగాస్టార్ పక్కన పెట్టేశాడా?
అయితే దసరా మూవీతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నటించనున్నట్టు తెలుస్తుంది. ఆమెను డైరెక్టర్ శ్రీకాంత్ కాంటాక్ట్ అయినట్టు సమాచారం. ఆమె ఎవరో కాదు రాణీ ముఖర్జీ(Rani Mukherjee). ఈ చిత్రంలో రాణీ ముఖర్జీని యాక్ట్ చేయాలని కోరినట్టు తెలుస్తుంది. ‘గులాం’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘హలో బ్రదర్’, ‘చోరి చోరి చుప్కే చుప్కే’ వంటి అనేక సూపర్ హిట్ హిందీ మూవీస్‌లో నటించిన ఈ సీనియర్ బ్యూటీ అప్పట్లో మంచి పేరు తెచ్చుకుంది. అయితే సౌంత్ ఇండియాలో మాత్రం ఒకేఒక ఫిలిమ్‌లో నటించింది. 2000లో రిలీజైన కల్ట్ క్లాసిక్ మూవీలో ‘హే రామ్’ లో రాణి ముఖర్జీ నటించింది. అయితే చిరంజీవితో నటిస్తే.. ఆమెకు ఇది సౌత్ నుంచి రెండో చిత్రం అవుతుంది. రాణి ముఖర్జీ ప్రముఖ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రాను 2014 లో వివాహం చేసుకుంది. ఇక ఆ తర్వాత సినెమాలకు బ్రేక్ ఇచ్చింది. ఒకవేళ ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. సెకండ్ ఇన్నింగ్స్‌లో మొదటి చిత్రం కానుంది.