Kamakshi Bhaskar: కామాక్షి భాస్కర్.. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. నటిగా, నిర్మాతగా, డైరెక్టర్‌గా, వైద్యురాలుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రియురాలు అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ.. జాన్సీ, శైతాన్, మా ఊరి పోలిమేర వంటి చిత్రాల్లో నటించి.. మంచి పాపులారిటీ సంపాదించుకుంది. విరూపాక్ష, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రౌడీ బాయ్స్, ఓం భీమ్ బుష్ సినిమాలతో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభిమానాన్ని తెచ్చిపెట్టుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్‌గా ఉంటుంది. వ్యక్తిగత విషయాలు, ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. 6 ఏండ్ల పాటు ఎంతో కస్టపడి మెడిసిన్ కోర్స్ చదివారు. వైద్య విద్య పూర్తిగానే కాగానే, వృత్తికి సంబంధించిన ప్రాక్టీస్ చేస్తూనే సినీ పరిశ్రమలో రాణించారు. నటిగా, నిర్మాతగా, డైరెక్టర్‌గా సినీ పరిశ్రమలో ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఆమె టాలెంట్‌కు అందరూ ఫిదా అవుతున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కామాక్షి భాస్కర్ పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకుంది. చిన్నప్పటి నుంచి సెపరేట్ ఉండటం అంటే ఇష్టమని చెప్పింది. తనకంటూ ఓ ప్రత్యేకమైన ప్రపంచమే ఏర్పాటు చేసుకున్నారట. స్కూల్‌లో చదువుతున్నప్పుడు అందరూ టీచర్లకు ఫేవరేట్ స్టూడెంట్‌గా ఉండే దాన్ని అని చెప్పింది. చదువు విషయంలో వెనుకాడేది కాదని, క్లాస్ ఫస్ట్ ఉండే దాన్ని అని పేర్కొంది. ఒక విధంగా చెప్పాలంటే పుస్తకాల పురుగుని అని వెల్లడించింది. పర్సనల్ విషయాలు ఎవరితో పంచుకునే దాన్ని కాదని, 20 ఏండ్లు వచ్చే వరకు కూడా ఏ విషయాలు కూడా ఇతరులతో షేర్ చేసుకునే దాన్ని కాదని పేర్కొంది. అది హ్యాపినెస్ అయినా.. సాడ్‌నెస్ అయినా ఎవరితో పంచుకునే దాన్ని కాదని అన్నారు. ఇక కాలేజీలో చదువుతున్న సమయంలో ఇల్లు, కాలేజీ తన ప్రపంచమని చెప్పుకొచ్చింది.
Also Read: రాయుడు నోటి దూల.. ఫ్యాన్స్ అస్సలు తగ్గట్లే
ఇక ఈ ప్రపంచాన్ని వీడి ఏదో చేయాలనే ఆలోచన వచ్చిందని అప్పుడే సినీ ఫీల్డ్ లోకి వెళ్లాలని అనిపించిందని పేర్కొంది. ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా, లారాదత్త, సుస్మితాసేన్ వంటి వాళ్ళు తనకు ఇన్స్పిరేషన్ అని చెప్పింది. మిడిల్ క్లాస్ కి చెందిన తాను వారిలా ప్రూవ్ చేసుకుని ఆ స్థాయికి ఎదగాలని అనుకున్నానని చెప్పింది. ఇలా ఆలోచనలు మార్చుకుంటూ ఈ స్థాయికి ఎదిగానని చెప్పింది. హైదరాబాద్ కు చెందిన కామాక్షి భాస్కర్ 6ఏండ్ల పాటు చైనాలో కూడా ఉన్నారు. అయితే ఆ సమయంలో చైనా వంటకాలు రుచి చేసేదాన్ని చెప్పుకొచ్చింది. ఒకసారి టేస్ట్ చేద్దాంలే అనే ఉద్దేశంతో చాలా వంటకాలు తినే దాన్ని అని పేర్కొంది. బొద్దింకలు, తేళ్లు వంటివి కూడా రుచి చూశానని చెప్పుకొచ్చింది.