Natural Star Nani
ఎంటర్‌టైన్మెంట్

HIT 3 Teaser: అర్జున్ సర్కార్‌గా నాని.. అరాచకం అంతే!

Hit 3 Teaser: హిట్ సిరీస్ చిత్రాలలో భాగంగా వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు మూడో పార్ట్ శరవేగంగా రెడీ అవుతుంది. మొదటి రెండ్ పార్ట్‌లను నిర్మించిన నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), ఈ మూడో పార్ట్‌లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంతి తిపిర్నేని, నాని నిర్మాతలు. సోమవారం (ఫిబ్రవరి 24) నాని పుట్టినరోజు సందర్భంగా ‘సర్కార్స్ లాఠీ’ అనే పేరుతో చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే, నానికి ఇంకో హిట్ రాసి పెట్టుకోవచ్చు అనేలా ఉంది. ఈ సిరీస్‌లో వచ్చే సినిమాలకు కావాల్సిన క్యూరియాసిటీని రేకెత్తించడంలో టీజర్ సక్సెస్ అయింది. నాని అభిమానులకు పర్ఫెక్ట్ బర్త్‌డే ట్రీట్ అనేలా ఈ టీజర్ ఉంది.

Also Read- Mokshagna Teja: 2025లోనూ మోక్షం లేనట్టేనా?

టీజర్‌ని గమనిస్తే.. పోలీసులను కలవరపెట్టేలా వరుస రహస్య హత్యలు జరుగుతున్నట్లుగా టీజర్ స్టార్టింగే ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేశారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆ వరుస హత్యల వెనుక ఉన్న హంతకుడు ఎవరనేది కనిపెట్టలేరు. ఇక చివరి ప్రయత్నంగా టెర్రిఫిక్, బ్రూటల్ ఇన్వెస్టిగేటర్ అయినటువంటి అర్జున్ సర్కార్‌ని రంగంలోకి దింపుతారు. నాని ఇంటెన్స్ ప్రజెన్స్, యాంగర్ ఎంట్రీ టీజర్‌కు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. అర్జున్ సర్కార్‌గా నాని పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇందులో కనబరిచాడనేది ఆయన కనబడిన ప్రతి ఫ్రేమ్‌లో తెలుస్తుంది. లాఠీ పట్టి, అసలు కనికరంలేని క్రూరుడి పాత్రలో నాని అదరగొట్టాడు. టీజర్‌లోని ఓ సీన్‌లో నేరస్థుడిని పొడిచిన తీరు ఆయన పాత్రలోని క్రూరత్వాన్ని తెలియజేస్తుంది. ఈ తరహా సినిమాలకు ఎలాంటి టీజర్ పడితే ఇంట్రస్ట్ వస్తుందో.. అలానే కట్ చేశారు.

దర్శకుడు శైలేష్ కొలను ఈ పార్ట్‌కీ అద్భుతమైన కథని రెడీ చేసినట్లుగా ఈ టీజర్ హింట్ ఇచ్చేస్తుంది. కథ, కథనంతో పాటు గ్రేట్ విజువల్స్‌ కూడా ఈ పార్ట్‌కి యాడ్ అయ్యాయనేది క్లారిటీగా అర్థమవుతోంది. అసలు ఇటువంటి చిత్రాలకు ఇప్పటి వరకు పని చేయని మిక్కీ జె మేయర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అనేలా ఉంది. సాంకేతికంగా సినిమా చాలా ఉన్నతంగా తెరకెక్కినట్లుగా ఈ టీజర్ చూస్తుంటే తెలిసిపోతుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో పాన్ ఇండియా స్థాయిలో 2025 మే 1న విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాలో నాని సరసన శ్రీనిధి శెట్టి (కెజియఫ్ ఫేమ్) హీరోయిన్‌గా నటిస్తుంది. నాని బర్త్‌డే స్పెషల్‌గా వచ్చిన ఈ టీజర్‌ను ఆయన అభిమానులు లైక్స్, షేర్స్‌తో వైరల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:
Trivikram Srinivas: సినిమాలకు దూరం.. పవన్‌తోనే పయనం

Pragya Jaiswal: ‘అఖండ 2’ నుంచి ప్రగ్యాను ఎందుకు తీసేశారు?

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు