Rashmika Mandanna: ‘ఛలో’ సినిమాతో రష్మికా మందన్నా హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో రష్మిక నటనకు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆమె అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వచ్చాయి. ఇక ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. అటు బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా ‘యానిమల్’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఇక ఇటీవల విడుదలైన ‘పుష్ప-2’ (Pushpa 2) మూవీతో నేషనల్ క్రష్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు తీస్తూ బిజీబిజీగా గడుపుతోంది. తాజాగా రష్మిక నటించిన హిందీ చిత్రం ‘చావా’ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ విశాల్ (Vicky Kaushal) హీరోగా నటించారు. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ వహించారు. ఫిబ్రవరి 14న రిలీజైన చావా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ నేపథ్యంలో రష్మిక సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఫొటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన వారంతా ‘పాపం విజయ్ దేవరకొండ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదేంటని అనుకుంటున్నారా.. అసలు విషయం ఏమిటంటే..
Also Read- Mokshagna Teja: 2025లోనూ మోక్షం లేనట్టేనా?
రష్మికా మందన్నా తన పోస్ట్‌లో ‘మహారాజు, మహారాణి’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఫొటోలో అంతా విజయ్ దేవరకొండ ఉంటాడని అనుకున్నారు. కానీ అక్కడ మహారాజు ప్లేస్‌లో మరో హీరో కనిపించడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ‘అదేంటి? మహారాజు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కదా?’ అంటూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఇలా అభిమానుల, నెటిజన్ల నుంచి వస్తున్న కామెంట్స్‌తో రష్మిక పోస్ట్ వైరల్ అవుతుంది. వాస్తవానికి ఇలా కామెంట్స్ రావడానికి కారణం కొంతకాలంగా వారిద్దరిపై వస్తున్న వార్తలే. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనేలా ఎప్పటి నుంచో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మధ్యమధ్యలో ఆ వార్తలకు బలం చేకూరుస్తూ వారిద్దరూ కనిపించడంతో, నిజంగానే వారు ప్రేమలో ఉన్నారని అంతా అనుకుంటున్నారు.

పైకి మేము స్నేహితులమే అని చెబుతున్నా, వారి కదలికలు మాత్రం ప్రేమికులనే భావనని అందరికీ కలిగిస్తున్నాయి. ఈ మధ్య రష్మిక చేసే పోస్ట్‌లు కూడా ఇన్‌డైరెక్ట్‌గా విజయ్ దేవరకొండ గురించే అనేలా ఉంటున్నాయి. అలాంటిది, ఎంత ‘ఛావా’ సినిమా చేస్తే మాత్రం.. ఒక్క సినిమాతోనే ‘నా మహారాజు’ అని రష్మిక ఎలా అంటుందని, వీడీ ఫ్యాన్స్ కూడా వాయిస్ రైజ్ చేస్తుండటం విశేషం. అయితే, రష్మిక మెంటాలిటీ తెలిసిన వారు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే, ఏ ఎండకి ఆ గొడుగు అన్నట్లుగా, ఆమె ఏ హీరోతో సినిమా చేస్తే, ఆ హీరోనే గొప్ప అనేట్లుగా కాకా పడుతుంటుంది. ఇప్పుడు విక్కీ కౌశల్ విషయంలో కూడా అదే చేస్తుందనేది, ఆమె బాగా గమనిస్తున్నవారు చెప్పే మాట. అది విషయం.
‘ఛావా’ విషయానికి వస్తే.. విక్కీ కౌశల్ నటనకు అంతా నీరాజనాలు పడుతున్నారు. అటు రష్మిక మహారాణి యేసుబాయి పాత్ర చేసి మన్ననలు అందుకుంటోంది. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా వంటి వారు కూడా ఇందులో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.310 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ చిత్రానికి టాక్స్ ఫ్రీ కూడా ఇచ్చారు. ఈ మూవీని తెలుగులో డబ్బింగ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా టాక్ నడుస్తోంది.