Minister Ponnam Prabhakar Aggressive On BJP Leaders
Politics

Ponnam Prabhakar: 317 జీవో …స్థానికత్వం అంశం కేంద్ర పరిధిలోనిది

Ponnam Prabhakar: 317 జీవో (GO 317) సవరణకు కట్టుబడి ఉన్నామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. 317 జీవో అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అధికార పార్టీ పై చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన జీవోపై బండి సంజయ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) ప్రస్తావిస్తున్నారని అది సరైనది కాదన్నారు.

‘ఎక్స్’ వేదికగా స్పందించిన మంత్రి… 317 జీవో సబ్ కమిటీ సభ్యుడిగా ఇప్పటికే స్పౌజ్, హెల్త్, మ్యూచువల్‌ కేసులను పరిశీలించి ఉద్యోగుల్ని ట్రాన్స్ ఫర్ చేసినట్లు స్పష్టం చేశారు. 317 జీవో సమస్యల పరిష్కారం పై ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉద్యోగులు, నిరుద్యోగులు తమ పైన భరోసా కలిగి ఉండాలని కోరారు. ఇప్పటికే… మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో తాను, శ్రీధర్ బాబు 317 జీవో పైన అనేక సమావేశాలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మా బాధ్యత నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇటువంటి సున్నితమైన అంశాన్ని ఎన్నికల్లో రాజకీయాలకు ఉపయోగించుకోవడం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారంలో ఉన్నాం మా బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో మీకు అనుకూలంగా ఉండేలా చేసేలా బాధ్యత మాది.. అని స్పష్టం చేశారు.

ఇక, స్థానికత్వం అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని పేర్కొన్నారు. దానికి సంబంధించి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తూ జోనల్ మార్పులకు సంబంధించి నివేదిక ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు.

317 జీవోతో సమస్య ఏంటంటే?

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను కొత్త జిల్లాల వారీగా కేటాయించేందుకు కేసీఆర్ సర్కారు తీసుకువచ్చిన జీవోనే 317 జీవో. తెలంగాణలో ఏర్పాటైన కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీవో ఇది. అయితే జీవో లోపభూయిష్టంగా ఉందని దీని ద్వారా పూర్తి న్యాయం జరగడం లేదని ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఆ జీవోను రద్దు చేయాలంటూ కొందరు ఉద్యోగులు హైకోర్టుకు కూడా వెళ్లారు.

రాష్ట్ర విభజన ముందు వరకు తెలంగాణలోని మొత్తం పది జిల్లాలు జోన్5, జోన్6 పరిధిలో ఉండేవి. కేసీఆర్ వచ్చిన తర్వాత పది జిల్లాలను 33 జిల్లాలుగా విభజించిన సంగతి తెలిసిందే. ముందు తాత్కలికంగా ఉద్యోగులను వర్క్ టూ ఆర్డర్ కింద పంపించిన అప్పటి సర్కారు తర్వాత 33 జిల్లాలను 7 జోన్లు, 2 మల్టీ జోన్ల కింద పునర్ వ్యవస్థీకరించింది. 2021లో దాన్ని కేంద్రం ఆమోదించింది.

అప్పటి ప్రభుత్వ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం… ఉద్యోగుల సీనియారిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అంటే… ఉద్యోగులు సీనియారిటీ ప్రకారం తాము కోరుకున్న జిల్లాను ఎంపిక చేసుకోవచ్చు. వచ్చిన సమస్య ఏంటంటే… ఖాళీలన్ని సీనియార్లకే నిండి పోతుండటంతో మిగిలిన వారికే తాము కోరుకున్న లేదా తమ సొంత జిల్లాలకు వెళ్లే అవకాశం ఉండదు. బదిలీ విషయంలో కూడా ఇదే ప్రాతిపదికన చేపడుతుండటంతో మిగిలిన వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఇక, మరొకటి స్థానికత అంశం..గతంలో ఉన్న పెద్ద జిల్లాను ప్రభుత్వం 5,6 ముక్కలుగా చేసింది. దీంతో పాత జిల్లాలోని ఉద్యోగులను కొత్త జిల్లాలకు సర్దుబాటు చేయడం మరో పెద్ద టాస్క్. ఇక్కడ కూడా సీనియారిటీనే పరిగణనలోకి తీసుకుంటుండటంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

 

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?