Pragya Jaiswal: నందమూరి బాలకృష్ణ (Balakrishna), డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో బిబి4గా రూపుదిద్దుకుంటున్న ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2 Thaandavam) చిత్రానికి సంబంధించి ఇప్పుడొక వార్త బాగా వైరల్ అవుతోంది. మొదటి భాగం ‘అఖండ’లో బాలయ్య సరసన నటించిన ప్రగ్యా జైస్వాల్‌కు రెండో భాగంలో చోటు లేకుండా చేశారనేది టాక్. ఆ విషయం ‘అఖండ2’ (Akhanda 2) హీరోయిన్ సంయుక్తా మీనన్ అని ప్రకటించినప్పుడే అందరికీ అనుమానాలు వచ్చాయి కానీ, మరో హీరోయిన్‌గా ఆమె కనిపిస్తుందేమో అని అంతా అనుకున్నారు. ఎందుకంటే, ‘అఖండ 2: తాండవం’ మూవీ పూజా కార్యక్రమాలలో బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ పైనే క్లాప్ కొట్టారు. ‘డాకు మహారాజ్’ ప్రమోషన్లలో కూడా వరుసగా బాలయ్య సినిమాలలో అవకాశం పట్ల ప్రగ్యా సంతోషాన్ని వ్యక్తం చేసింది. మరి ఏమైందో ఏమోగానీ, ఆమెను పక్కన పెట్టేసి, సంయుక్తా మీనన్‌ను హీరోయిన్‌గా ప్రకటించారు. దీంతో, టాలీవుడ్ సర్కిల్స్‌లో రకరకాల అనుమానాలు మొదలయ్యాయి.
నిజంగా రెమ్యూనరేషనే కారణమా?
ప్రగ్యా జైస్వాల్‌ను ‘అఖండ 2: తాండవం’ నుంచి తీసేయడానికి ప్రధాన కారణం, ఆమె భారీగా రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేయడమే అనేలా చిత్రయూనిట్ వైపు నుంచి వార్తలు వినబడుతున్నాయి. ఆమె ఈ సినిమా కోసం భారీగా డిమాండ్ చేయడంతో, దర్శకుడు బోయపాటి ఆమెను కాదని, సంయుక్తా మీనన్‌కు ఆహ్వానం పలికినట్లుగా టాక్. కానీ ఈ వార్తలు నిజం అని నమ్మడానికి వీలులేకుండా ఉన్నాయి. ప్రగ్యా జైస్వాల్ ఇప్పుడేమీ స్టార్ హీరోయిన్ కాదు, బాలయ్య సినిమా తప్పితే ఆమె చేతిలో మరో సినిమా కూడా లేదు. అలాంటి నటి, భారీగా డిమాండ్ చేసిందంటే నమ్మడం కష్టమే. ఒకవేళ అడిగినా, ఇప్పుడున్న రెమ్యునరేషన్‌పైన మహా అయితే ఇంకొన్ని లక్షలు అడిగి ఉండవచ్చేమో. అందులోనూ ఇప్పుడామె బాలయ్య లక్కీ హీరోయిన్లలో ఒకరుగా చేరింది. నటసింహం వరుసగా నాలుగు విజయాలు సాధిస్తే, అందులో రెండింటిలో హీరోయిన్ ప్రగ్యానే. అలాంటి హీరోయిన్‌ని రెమ్యునరేషన్ వంకతో పక్కన పెట్టేశారంటే, కచ్చితంగా ఏదో విషయం ఉందనేలా ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు నడుస్తున్నాయి.

బాలయ్యకు తెలియకుండానే..
నటసింహం బాలకృష్ణతో సినిమా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని అంతా భావిస్తుంటారు. అలాంటిది, ఆయనకు తెలియకుండానే ఈ సినిమాలో హీరోయిన్‌ని మార్చేశారనేది తాజాగా వినిపిస్తున్న సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య, బోయపాటిపై ఆగ్రహం వ్యక్తం చేశాడని కూడా టాక్ నడుస్తోంది. ‘అఖండ’లో కనిపించిన హీరోయిన్, ‘అఖండ2’లో కనిపించకపోతే ప్రేక్షకులు గందరగోళానికి లోనవుతారని, ఇష్టం వచ్చినట్లుగా చేయవద్దు అంటూ దర్శకుడిపై కోపగించుకున్నాడట. ఇందులో ప్రగ్యా పాత్రను చనిపోయినట్లుగా చూపిస్తున్నామని బోయపాటి ఏదోలా సర్దిచెప్పుకున్నాడట. కనీసం ఫొటో కూడా పెట్టకుండా, ఆమె చనిపోయినట్లుగా చిత్రీకరణ జరుపుతుండటంతో బోయపాటి శ్రీనుకు వార్నింగ్ ఇచ్చేంత వరకు వ్యవహారం వెళ్లిందనేది తాజా సమాచారం.
బోయపాటి-ప్రగ్యా మధ్య ఏం జరిగింది?
బాలకృష్ణ లక్కీ హీరోయిన్‌గా మారకముందే ప్రగ్యా జైస్వాల్ బోయపాటికి చాలా ఇష్టమైన హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘జయ జానకి నాయక’, ‘అఖండ’ చిత్రాలలో ఏరి కోరి మరీ ఈ భామకు ఛాన్స్ ఇచ్చాడు. మొదట ‘అఖండ 2’కి కూడా ఈ బ్యూటీనే హీరోయిన్‌గా ప్రకటించాడు. ఇంతలోనే, ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, ప్రగ్యాని కాదని సంయుక్తాని లైన్‌లోకి తెచ్చాడు. వాస్తవానికి మొదటి నుంచి ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఆ విషయం ఇటీవల జరిగిన చిత్ర ప్రారంభోత్సవంలో కూడా కనిపించింది. అంతా బాగుందని అనుకుంటున్న సమయంలో ఏం తేడా కొట్టిందో ఏమోగానీ, ఈ బ్యూటీని పక్కనపెట్టి మరో భామను ‘అఖండ’ కాంపౌండ్‌లోకి తెచ్చేశాడు బోయపాటి.