Shabdham Pre Release Event
ఎంటర్‌టైన్మెంట్

Shabdham: హాలీవుడ్ రేంజ్ హారర్ ఫిల్మ్.. విడుదలకు రెడీ!

Shabdham: టాలీవుడ్ నటుడు ఆది పినిశెట్టి, డైరెక్టర్ అరివళగన్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘శబ్దం’. సూపర్‌ నేచురల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రాన్ని 7జీ ఫిల్మ్స్‌ పతాకంపై శివ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 28న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. సిమ్రాన్‌, లైలా, లక్ష్మీమీనన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను అలరించగా, ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్‌లో స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే ప్రీ రీలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నేచురల్ స్టార్ నాని హాజరయ్యారు. ఈ సందర్బంగా నాని మాట్లాడుతూ.. ఆది పినిశెట్టి తన క్లోజ్ ఫ్రెండ్ అని అన్నారు. హారర్ కథగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం అద్భుతంగా ఉంటుందని తెలిపారు. టెక్నికల్‌గా కూడా చాలా బాగుంటుందని చెప్పుకొచ్చారు. కొన్ని ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయని, ఈ మూవీ బిగ్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read- Tallest Heroine: సినీ ఇండస్ట్రీలో హైట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

అనంతరం ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. ‘వైశాలి’ సినిమా తర్వాత డైరెక్టర్ అరివళగన్ కాంబినేషన్‌లో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని అన్నారు. ‘వైశాలి’ తర్వాత వెంటన ఓ సినిమా తీద్దామని అనుకున్నాం, అది ఇప్పటికి కుదిరింది. ఇకపై కూడా మా కాంబినేషన్‌లో మరిన్ని మంచి చిత్రాలు వస్తాయని తెలిపారు. టెక్నికల్‌గా ‘శబ్దం’ మూవీ హాలీవుడ్‌ని తలిపించేలా ఉంటుందని, తక్కువ బడ్జెట్‌లో ఆ తరహా సినిమా తీసేందుకు టీమ్ అంతా ప్రయత్నించామని అన్నారు. అదే క్వాలిటీకి దాదాపు రీచ్ అయ్యామని పేర్కొన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ అవుతారని, హారర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ మూవీ కంటెంట్ ఉంటుందని వెల్లడించారు.

ఇంకా బాలయ్య – బోయపాటి ‘అఖండ 2’ సినిమా విషయాలు కూడా ఆయన పంచుకున్నారు. ఫస్ట్ పార్ట్‌ని మించి ‘అఖండ -2’ ఉంటుందని అన్నారు. ఈ మూవీలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యిందని, నటసింహం బాలకృష్ణతో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. కాగా, తెలుగు-తమిళ బైలింగ్వల్ మూవీగా ‘శబ్దం’ రూపుదిద్దుకుంది.

ఇవి కూడా చదవండి:
People Media Factory: చిక్కుల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. గట్టెక్కేనా?

Trivikram Srinivas: సినిమాలకు దూరం.. పవన్‌తోనే పయనం

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?