Hero Sriram in Maathru Movie
ఎంటర్‌టైన్మెంట్

Maathru: ‘అపరంజి బొమ్మ మా అమ్మ’.. హృదయాన్ని హత్తుకుంటున్న అమ్మ పాట

Maathru: మదర్ సెంటిమెంట్‌లో ఈ మధ్య కాలంలో సరైన సినిమా రాలేదనే చెప్పుకోవాలి. అప్పుడెప్పుడో వచ్చిన ‘మాతృదేవోభవ’, ఇటీవల వచ్చిన ‘బిచ్చగాడు’ సినిమాలు తప్పితే.. అమ్మపై అంతగా సినిమాలు ఫోకస్ కాలేదు. అమ్మ నేపథ్యంలో వచ్చిన ‘మాతృదేవోభవ’, ‘బిచ్చగాడు’ సినిమాలు మాత్రం కల్ట్ క్లాసిక్స్‌గా నిలిచాయి. బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. చాలా గ్యాప్ తర్వాత ఈ రెండు సినిమాల తరహాలోనే ఓ సినిమా రాబోతోంది. ఆ సినిమా పేరే ‘మాతృ’. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘అపరంజి బొమ్మ.. మా అమ్మ’ అనే పాట మంచి స్పందనను రాబట్టుకుంటూ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Also Read-  Allu Arjun: ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌కు ఆ ఫోబియా పోలేదా!

శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై శ్రీ పద్మ సమర్పణలో.. బి. శివ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘మాతృ’. శ్రీరామ్, నందినీ రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్ వంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. జాన్ జక్కీ దర్శకత్వంలో మదర్ సెంటిమెంట్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని.. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టిన మేకర్స్ ఇప్పటికే ఈ సినిమాలోని ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘అపరంజి బొమ్మ.. మా అమ్మ’ అంటూ వచ్చిన ఈ పాటను దినేశ్ రుద్ర ఆలపించగా, నిర్మాత బి. శివ ప్రసాద్ సాహిత్యాన్ని అందించారు. ఈ పాటకు శేఖర్ చంద్ర బాణీ హృదయాన్ని హత్తుకునేలా ఉంది.

ప్రతి ఒక్కరూ వాళ్ల అమ్మకు అంకితం ఇచ్చేలా.. ఈ పాట అందరి హృదయాల్ని కరిగించేస్తుంది. ఆ విషయం యూట్యూబ్‌లో ఉన్న ఈ పాటకు వస్తున్న కామెంట్స్ చూస్తుంటేనే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమా నిర్మాతే ఇంతటి గొప్ప పాటను రాయడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ చిత్రానికి రాహుల్ శ్రీ వాత్సవ్ కెమెరామెన్‌గా, సత్యనారాయణ బల్లా ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహించగా.. త్వరలోనే గ్రాండ్‌గా రిలీజ్‌కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: 

Laila Movie: డామిట్.. ‘లైలా’ బట్టలు, మేకప్ ఖర్చు కూడా రాలేదా?

Harish Shankar Leaks: ఆశలు పెట్టుకోకు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’లో ఆ సీన్ వాడేశా!

Just In

01

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

Naresh65: కామెడీ గోస్ కాస్మిక్.. అల్లరి నరేష్ 65వ చిత్ర వివరాలివే..!

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది