Oh Bhama Ayyo Rama: యువ హీరో సుహాస్ వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూనే, మరోవైపు హీరోగానూ సక్సెస్‌లు అందుకుంటున్నాడు. ప్రస్తుతం హీరోగా సుహాస్ చేతుల్లో నాలుగైదు సినిమాలు ఉన్నాయంటే, ఆయనతో సినిమాలు చేసేందుకు మేకర్స్ ఎంత ఆసక్తిని కనబరుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సుహాస్ కూడా రొటీన్‌గా కాకుండా వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన హీరోగా చేస్తున్న ఓ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సుహాస్, మాళవిక మనోజ్ హీరోహీరోయిన్లుగా చేస్తున్న ‘ఓ భామ అయ్యో రామ’ అనే చిత్రంలో టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ ఒకరు అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయం టీమ్ కూడా కన్ఫర్మ్ చేసింది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరని అనుకుంటున్నారా?
Also Read- Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆ ఫోబియా పోలేదా!
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనగానే అందరికీ యాదిలోకి వచ్చుండాలి. ఇంకా రాకపోతే మాత్రం సినిమాలపై మీకు పెద్దగా అవగాహన లేదనే అనుకోవచ్చు. సరే ఆ విషయం పక్కన పెడితే.. ఆ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ మరెవరో కాదు హరీష్ శంకర్. వీ ఆర్ట్స్ పతాకంపై రామ్ గోధలను దర్శకుడిగా పరిచయం చేస్తూ హరీష్ నల్ల నిర్మిస్తోన్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై క్రేజ్ ఏర్పడేలా చేసింది. ఇప్పడీ సినిమాలో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ అతిథి పాత్రలో చేస్తున్నాడనే అప్డేట్‌తో ఈ సినిమా వార్తలలో నిలుస్తోంది. ఇందులోని హరీష్ శంకర్ పాత్ర కూడా చాలా వైవిధ్యంగా మలిచారని, ఆ పాత్రకు సంబంధించిన షూట్ కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది.

ఈ అప్డేట్‌పై చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రం సుహాస్ కెరీర్‌లో ఓ గొప్ప చిత్రంగా నిలబడుతుందని కచ్చితంగా చెప్పగలము. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, ది బెస్ట్ క్వాలిటీతో సినిమాను రెడీ చేస్తున్నాం. ఇందులో సున్నితమైన ప్రేమ, భావోద్వేగాలతో పాటు అంతకుమించిన ఫన్ ఉంటుంది. ఇందులో హెల్దీ కామెడీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుందని నమ్ముతున్నాం. ఇక ఇందులో ఓ పాత్రకి దర్శకుడు హరీష్ శంకర్‌ను అడగగానే ఓకే చెప్పారు. అందుకు ఆయనకు మా టీమ్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే అనిత (‘నువ్వు నేను’ మూవీ హీరోయిన్), అలీ వంటి వారు కీలక పాత్రలలో నటించారు. అత్యుత్తమ సాంకేతిక బృందం ఈ సినిమాకు పనిచేస్తుంది. ఈ వేసవికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి: