Producer SKN: ‘బేబి’ చిత్ర నిర్మాత ఎస్‌కెఎన్ ఈ మధ్య తరచూ వార్తలలో నిలుస్తున్నాడు. మాములుగానే ఆయన ట్విట్టర్ ఎక్స్‌లో యమా యాక్టివ్‌గా ఉంటాడు. ప్రతిదానికి స్పందిస్తుంటాడు. ఎవరైనా సాయం అడిగితే.. నిజంగా ఆ సాయం అతనికి ఎంత అవసరమో కనుక్కుని మరీ సహాయం చేస్తుంటాడు. అలాంటి నిర్మాత ఇటీవల ఓ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలు ఎలాంటి కాంట్రవర్సీకి దారి తీశాయో తెలియంది కాదు. టంగ్ స్లిప్ అయ్యాను, సరదాగా మాట్లాడాను.. వాటిని పరిగణనలోకి తీసుకోకండి అంటూ కవరింగ్ చేసే ప్రయత్నం చేశాడు.. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఆ తర్వాత తను పబ్లిక్ ఫంక్షన్‌లో మాట్లాడిన మాటలకి, సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని విడుదల చేసి, పెద్ద లెక్చరే ఇచ్చాడు.
Also Read- Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆ ఫోబియా పోలేదా!
అసలు జరిగింది ఇదే!
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు నిర్మాత ఎస్‌కెఎన్ అతిథిగా హాజరయ్యాడు. ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ వంటి వారు నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో హీరోయిన్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేను, సాయి రాజేష్ ఇకపై తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించకూడదని ఫిక్సయ్యాం. ఆల్రెడీ తెలుగు అమ్మాయిలని ప్రోత్సహించినందుకు మాకు జరగాల్సిందే జరిగింది.. ఇకపై ఇతర భాషల అమ్మాయిలనే ప్రోత్సహించాలని అనుకుంటున్నాం.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు దుమారం కావడంతో, మరుసటి రోజు, ఎక్స్‌లో ఓ వీడియోని పోస్ట్ చేసి, తెలుగు అమ్మాయిలకు నేను ఇచ్చినట్లుగా సపోర్ట్ ఎవరూ ఇవ్వలేదు. నా రాబోయే సినిమాలలో కూడా తెలుగు వారికే అవకాశాలు ఇస్తున్నాను. ఆ ఈవెంట్‌లో సరదాగా అన్న మాటలని పట్టుకుని కాంట్రవర్సీ చేయవద్దు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈలోపు తెలుగు హీరోయిన్లు కొందరు ఆయనపై ఫైర్ అవుతూ పోస్ట్‌లు చేశారు. ఈ విషయం ప్రస్తుతం కాస్త సద్దుమణిగింది.
There are few people requesting help saying they lost money in online betting apps
Brothers PLEASE BE CAREFUL with these apps , don’t tempt for easy money…..these apps are designed to loot but won’t help you
Don’t fall for the trap & lose ur hard earned money
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) February 20, 2025
మరోసారి హెల్ప్ అంటూ పోస్ట్
తెలుగు అమ్మాయిలకు హెల్ప్ చేయను అంటూ మాట్లాడిన ఎస్‌కెఎన్.. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ‘హెల్ప్ కోసం కాదు’ అంటూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో ఆయన ఏం చెప్పారంటే.. ‘‘ఈ మధ్య ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లలో డబ్బు పోగొట్టుకున్నామని, సహాయం చేయమని అభ్యర్థిస్తున్న వారిని ఎక్కువగా చూస్తున్నాను. దయచేసి బెట్టింగ్ యాప్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సులభంగా మనీ సంపాదించవచ్చని టెంప్ట్ అవకండి. ఈ యాప్‌లను దోచుకోవడానికి మాత్రమే తయారు చేశారు తప్పితే, మీకు సహాయం చేయడానికి కాదని తెలుసుకోండి. దయచేసి ఈ బెట్టింగ్ యాప్‌ల ఉచ్చులో పడి, ఎంతో కష్టపడి సంపాదించిన మనీని పోగొట్టుకోకండి’’ అంటూ ఎస్‌కెఎన్, ఈ పోస్ట్‌లో రిక్వెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి: