ఏపీలోని (AP) మిర్చి రైతులను (Mirchi Farmers) ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజ్జప్తి చేశామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Minister Ram Mohan Naidu) తెలిపారు. మిర్చికి రూ. 11,600 పైగా మద్దతు ధర ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు. వ్యవసాయశాఖ మంత్రితో సమావేశమైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో మిర్చి రైతులు కష్టాల్లో ఉన్నట్లు చౌహాన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మిర్చి ఎగుమతుల గురించి అలాగే దానికి అంతర్జాతీయ మార్కెట్ కల్పించే అంశంపై చర్చించినట్లు చెప్పారు. సమస్య పట్ల వ్యవసాయ మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. ఎగుమతి దారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారన్నారు.
కాగా, ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ (Ys JAGAN)… గుంటూరు మిర్చి యార్డుకు (Guntur Mirchi Yard) వెళ్లి అక్కడి రైతులకు మద్దతుగా నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) సైతం మిర్చి రైతులను ఆదుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. తాజాగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యవసాయశాఖ మంత్రితో సమావేశమై మిర్చి రైతుల సమస్యలపై చర్చించినట్లు చెప్పారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటకు మద్దతు ధర లేక, కొనుగోలు కేంద్రాలు లేక నానా యాతన పడుతున్నారు. ఈ సమస్య వైసీపీ లేవనెత్తడంతో ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. చంద్రబాబును లేఖ రాయడం, రామ్మోహన్ నాయుడు రంగంలోకి దిగడంతో కేంద్రం దిగొచ్చింది.
మద్ధతు ధర కల్పించడం తో పాటు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో 25 శాతం ఉన్న సీలింగ్ ను ఎత్తివేసే అంశాన్ని సైతం కేంద్రం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి
CM CHANDRABABU NAIDU: ఢిల్లీని తాకిన మిర్చి ఘాటు