kcr
Politics

Cast Census: అందుకు ముందుకు రాని కేసీఆర్ కుటుంబం

Cast Census: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేస్తున్న ప్రయత్నం కులగణన (Cast Census). ఇప్పటికే రికార్డు స్థాయిలో ఇంటింటి సర్వే (Survey) చేసి అందరి వివరాలు ప్రభుత్వ యంత్రాంగం నమోదు చేసింది. వివిధ కారణాలతో సర్వేలో పాల్గొనని 3.56 లక్షల కుటుంబాల కోసం మరో అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఈ నెల 16 నుంచి 28వరకు మూడు మార్గాల్లో సర్వేలో పాల్గొనేలా వెసులుబాటును కల్పించింది. అయితే రెండో దశ సర్వే మొదలై నాలుగు రోజులు గడిచినా ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉందని ప్లానింగ్ శాఖ అధికారులు అంటున్నారు.

 ఫోన్లు 6వేలు… ముందుకొచ్చినవి వెయ్యి కుటుంబాలే!

టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే చాలు తామే ఆ ఇంటికి వచ్చి సర్వే పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గత ఐదు రోజుల్లో 6,415 మంది మాత్రమే కాల్ సెంటర్‌కు ఫోన్ చేసినట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో సుమారు మూడు వేల మంది జీహెచ్ఎంసీ పరిధిలో నుంచి ఫోన్ చేస్తే, మిగతా 3,500 మంది రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కాల్ సెంటర్‌కు ఫోన్ చేశారు. అయితే అలా ఫోన్ చేసిన వారు కూడా సమాచారం తెలుసుకుంటున్నారే తప్ప, కులగణన దరఖాస్తును నింపేందుకు ముందుకు రావటం లేదని సమాచారం. మొత్తం 1,091 కుటుంబాలు మాత్రమే ముందుకు వచ్చి గత ఐదు రోజుల్లో కులగణనలో పాల్గొని వివరాలు దరఖాస్తు ద్వారా నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకుని నింపిన వారి సంఖ్య, ప్రజా పాలన కేంద్రాలకు వెళ్లిన వారి సంఖ్య మరింత తక్కువగా ఉంది.

మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కే చంద్రశేఖర రావుతో పాటు కుటుంబ సభ్యులు (KCR family), మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao) సర్వేలో పాల్గొనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్యమంత్రితో సహా మంత్రులు కూడా ఇప్పటికే పలుమార్లు ఈ మేరకు విజ్ఞప్తి  చేశారు.

ఈ నెల 28వరకు అవకాశం..

బీసీల సంఖ్యను నిర్ణయించటంతో పాటు, భవిష్యత్‌లో అన్ని వర్గాలకు సంక్షేమ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు, పథకాల రూపకల్పనకు కులగణన తోడ్పడుతుందని ప్రణాళికా శాఖ అధికారులు అంటున్నారు. అందుకే సర్వే పూర్తిస్థాయిలో ఉండాలని, రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలు సర్వే పరిధిలోకి రావాలనే ఉద్దేశ్యంతో రెండో అవకాశం ప్రభుత్వం కల్పించిందని వారు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ నెల 28 లోపు మిగతా వారందరూ సర్వేలో పాల్గొనాలని ప్రణాళికశాఖ కోరింది.

అయితే, కులగణను అధికార కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మంగా చేపట్టినప్పటికీ లెక్క పక్కాగా తేలలేదని, బీసీల లెక్క తక్కువ చేసి చూపించారని విమర్శలు వచ్చాయి. సొంత పార్టీలోనే అసమ్మతి వ్యక్తమైంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సర్వే రిపోర్టును కాల్చేసి నిరసన తెలిపారు. బీసీ సంఘాల నేతలు సైతం సర్వే తప్పుల తడక అని దుమ్మెత్తి పోశారు. ఇక, ప్రతిపక్షాలు కులగణన సరిగ్గా జరగలేదని కేసీఆర్ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే కంటే జనాభా తగ్గడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. కాస్ట్ సెన్సెస్ విషయంలో కాంగ్రెస్  సెల్ఫ్ గోల్ వేసుకుందని హరీశ్ రావు లాంటి నేతలు పదే పదే విమర్శించారు. దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… కేసీఆర్ కుటుంబానికి సర్వే పట్ల చిత్తశుద్ధి లేదని బీఆర్ ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులంతా వివరాలు ఇవ్వకపోవడం వల్లే అసలైన లెక్కలో తేడా ఉందని ఆ పార్టీని డిఫెన్స్ లోకి నెట్టారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులను. ఇక్కడ రేవంత్ వ్యూహత్మకంగా వ్యవహరించారు.  వివరాలు ఇవ్వని వారు 3.1 శాతం మంది ఉన్నారని ప్రకటించిది… అందులో కేసీఆర్ ఫ్యామిలీ కూడా ఉంది. కాబట్టి లెక్క ఎందుకు తేలలేదు అంటే… ఇదిగో ఇంతమంది వివరాలు ఇవ్వలేదు కాబట్టి అని చెప్తుంది. భవిష్యత్తులో కూడా. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు వారి నాయకులు ఇవ్వకపోతే బీసీలకు వాళ్లకు వ్యతిరేకమనే వాళ్లు చెప్పకనే చెప్పినట్లవుతుంది.

మొత్తం మీదా కుల గణన విషయంలో పార్టీల తీరు ‘చిత్తం శివుని మీద… భక్తి చెప్పుల మీద’ అన్నట్లుగా ఉందనే అందరూ భావిస్తున్నారు. అది పక్కనపెడితే , మరి ఈ మలి దశ గణన సంగతి ఏంటీ అని ఆలోచిస్తే… రాజకీయాల మీద కనీస అవగాహన ఉన్న వాళ్లు ఎవరూ కూడా కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు సర్వేలో పాల్గొని వివరాలు ఇస్తారనైతే అనుకోవడం లేదు. మరీ… ఆ బలహీనతను రేవంత్ వాడకోకుండా ఉంటారా అంటే… అది వేరే చెప్పాలా అంటున్నారు!

 

Just In

01

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!