Anjana Devi: మెగాస్టార్ చిరంజీవి మదర్ అంజనాదేవి అస్వస్థతకు గురవడంతో, చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అంజనాదేవికి ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్లు చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం. ఈ విషయం తెలిసి, అంజనా దేవి చిన్న కుమారుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన కార్యక్రమాలన్నింటిని వాయిదా వేసుకుని విజయవాడ నుండి హైదరాబాద్‌కు బయలుదేరినట్లుగా తెలుస్తోంది. మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా తన RC16 సినిమా షూట్ నుండి సరాసరి హాస్పిటల్‌కు వెళ్లినట్లుగా వినబడుతోంది.
Also Read- Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆ ఫోబియా పోలేదా!
ఇక అంజనాదేవి పెద్ద కుమారుడైన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం దుబాయ్‌లో తన భార్యతో కలిసి పెళ్లి రోజు వేడుకలలో నిమగ్నమై ఉన్నారు. చిరంజీవి, సురేఖల పెళ్లి రోజైన ఫిబ్రవరి 20న, స్నేహితులతో కలిసి ఫ్లైట్‌లో దుబాయ్ వెళుతున్నట్లుగా చిరంజీవి ఓ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. మదర్ హెల్త్ బాగా లేదని తెలిసి వారు కూడా వెంటనే తిరుగు ప్రయాణమైనట్లుగా మెగా సన్నిహిత వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. అయితే, అసలు అంజనాదేవికి ఏమైంది, ఎందుకు హాస్పిటల్‌లో జాయిన్ చేశారు? అంటే, ఆమెకు సడెన్‌గా ఫీవర్ రావడంతో, నార్మల్ చెకప్ నిమిత్తం హాస్పిటల్‌కు తీసుకువెళ్లారనేది తాజా అప్డేట్.

త్వరగా కోలుకోవాలి
పేరుకు కొణిదెల ఫ్యామిలీనే అయినా.. మెగాస్టార్ చిరంజీవి సక్సెస్‌తో మెగా ఫ్యామిలీగా ఆ ఫ్యామిలీకి పేరు పడింది. కొణిదెల వెంకటరావు, అంజనా దేవి దంపతులకు పుట్టిన పెద్ద కుమారుడు శివశంకర్ వరప్రసాద్ ఎలా చిరంజీవిగా మారాడో అందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి, ఎటువంటి సపోర్ట్ లేకుండా నెంబర్ వన్ స్థానానికి చేరుకుని, తన ఫ్యామిలీనే మెగా ఫ్యామిలీగా మార్చేశారు. దాదాపు 10 మందికి పైగా హీరోలు ఇప్పుడా ఫ్యామిలీలో ఉన్నారు. మెగాభిమానులతో కలిపి ఆయనొక పెద్ద సామ్రాజ్యాన్నే క్రియేట్ చేశారు. మెగా ఫ్యామిలీపై చిన్న మాట కూడా పడనివ్వని అభిమానగణం చిరంజీవి సొంతం. అలాంటిది, ఇప్పుడు అంజనమ్మకు అస్వస్థత అంటే, తమ ఫ్యామిలీలో పర్సన్‌కు హెల్త్ బాగాలేదనేలా భావిస్తూ, మెగా ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు మెగా అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. అంజనమ్మ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి: