Chiranjeevi with His Friends
ఎంటర్‌టైన్మెంట్

Chiru – Surekha: ఫ్లైట్‌లో.. చిరంజీవి ఇలాంటి పోస్ట్ చేస్తాడని ఎవరైనా ఊహించి ఉంటారా?

Chiru – Surekha: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), సురేఖ దంపతులు వారి మ్యారేజ్‌ డే (ఫిబ్రవరి 20)ను ఫ్లైట్‌లో జరుపుకున్నారు. ఆ ఫొటోలను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ఎక్స్ వేదికగా షేర్ చేయడంతో, అవి వైరల్ అవుతున్నాయి. ఫ్లైట్‌లో మ్యారేజ్ డే‌ను సెలబ్రేట్ చేసుకోవడమే పెద్ద విశేషం అయితే, ఈ సెలబ్రేషన్స్‌కు హాజరైన వారిని చూస్తే మరింత ఆశ్చర్యపోకమానరు. అలాంటి గెస్ట్‌లు ఈ సెలబ్రేషన్స్‌లో కనిపించారు. స్నేహితుల సమక్షంలో దుబాయ్‌లో పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకునేందుకు వెళుతున్నట్లుగా చెబుతూ, చిరంజీవి కొన్ని ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోలతో పాటు మెగాస్టార్ తన పోస్ట్‌లో ఏం చెప్పారంటే..

Also Read-  Allu Arjun: ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌కు ఆ ఫోబియా పోలేదా!

థ్యాంక్యూ మై సోల్‌మేట్
‘‘నా డ్రీమ్ లైఫ్ పార్టనర్ సురేఖ, నా లైఫ్‌లోకి అడుగు పెట్టినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తుంటాను. ఆమే నా ధైర్యం, నమ్మకం. ఈ ప్రపంచంలో ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకునేందుకు ఎప్పుడూ నాకు సాయం చేస్తుంటుంది. ఆమె ప్రతి సందర్భంలోనూ నాకు ఎంతో ప్రేరణని కలిగిస్తుంటుంది. నా భాగస్వామి అంటే నాకు ఎంత ఇష్టమో తెలిపేందుకు ఈ క్షణాలను వినియోగించుకుంటున్నాను. థ్యాంక్యూ మై సోల్‌మేట్. మా ఇద్దరికీ ఎంతో ప్రత్యేకమైన ఈ రోజున శుభాకాంక్షలు చెప్పిన ఫ్యామిలీ మెంబర్స్‌కు, ఫ్రెండ్స్‌కు, ఆత్మీయులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను’’ అంటూ చిరంజీవి రెండు ఫొటోలను తన పోస్ట్‌కు యాడ్ చేశారు.

ఊహించని గెస్ట్‌లు
చిరు పోస్ట్ చేసిన ఫ్లైట్ ఫొటోలను గమనిస్తే.. ఇందులో ఊహించని వారంతా ఈ సెలబ్రేషన్స్‌కు హాజరవుతుండటం విశేషం. మెగాస్టార్ చిరంజీవి, సురేఖలతో పాటు ఈ ఫ్లైట్‌తో కింగ్ నాగార్జున (King Nagarjuna), అమల (Amala) దంపతులు ఉన్నారు. ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి (Super Star Mahesh Babu Wife) నమ్రతా శిరోద్కర్ కూడా ఉన్నారు. వీరితో పాటు మరికొందరు ఈ ఫ్లైట్‌లో దుబాయ్ వెళుతున్నారు. వీరంతా ఫ్లైట్‌లో చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చాలు ఇచ్చి పెళ్లిరోజులు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లుగా ఈ ఫొటోలను చూస్తుంటే అర్థమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి, సురేఖల వివాహం 20 ఫిబ్రవరి, 1980లో మద్రాసులో జరిగింది. ఈ పెళ్లి రోజుతో వారు 45 వసంతాలు పూర్తి చేసుకుని 46వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు.

ఇవి కూడా చదవండి: 

Laila Movie: డామిట్.. ‘లైలా’ బట్టలు, మేకప్ ఖర్చు కూడా రాలేదా?

Harish Shankar Leaks: ఆశలు పెట్టుకోకు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’లో ఆ సీన్ వాడేశా!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు