NTR X Neel: టైగర్ లేకుండానే ‘డ్రాగన్’ | Swetchadaily | Telugu Online Daily News
DRAGON
ఎంటర్‌టైన్‌మెంట్

NTR X Neel: టైగర్ లేకుండానే ‘డ్రాగన్’

NTR X Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికాగా రెగ్యులర్ షూటింగ్‌కు మూవీ టీమ్ సిద్ధమైంది. గురువారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా, ఈ షూట్ కోసం భారీ సెట్టింగ్‌లను నిర్మించారు. రామోజీ ఫిల్మ్ సిటీలోనే 10 రోజుల పాటు మొదటి షెడ్యూల్‌ని చిత్రీకరించనున్నారు. ఈ షూట్‌లో 1500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొననున్నారు. అయితే ఎన్టీఆర్‌కు సంబంధించిన సన్నివేశాలు మాత్రం మొదటి షెడ్యూల్‌లో లేనట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుంది. మిగతా తారాగణం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ప్రశాంత్ నీల్ టెక్నీకల్ విభాగమే ఈ సినిమాకు కూడా పని చేయనుంది. బంగ్లాదేశ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ‘వార్ 2 షూట్’ ముగించుకొని బ్రేక్‌లో ఉన్నారు. ఆయన మార్చి నెల నుండి డ్రాగన్ సెట్స్‌లో జాయిన్ కానున్నారు.

ఇవి కూడా చదవండి: 

Laila Movie: డామిట్.. ‘లైలా’ బట్టలు, మేకప్ ఖర్చు కూడా రాలేదా?

Harish Shankar Leaks: ఆశలు పెట్టుకోకు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’లో ఆ సీన్ వాడేశా!

 

Just In

01

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి

Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై ప్రియాంక గాంధీ ఫైర్!