metro pillar advertising Contract scam
Politics

Hyderabad : అన్నింటా అవినీతి! అక్రమార్జనే లక్ష్యంగా గులాబీ..!!

– హైదరాబాద్ మెట్రో ఆదాయానికి గండి
– జీహెచ్ఎంసీకి మొండిచేయి
– చిన్న అడ్వర్టైజ్‌మెంట్ కంపెనీల కనుమరుగు
– బడా సంస్థల్ని పెంచి పోషించిన బీఆర్ఎస్ సర్కార్
– విజిలెన్స్‌కు అందిన ఫిర్యాదు

: కేసీఆర్ పాలనలో ఎన్నో అక్రమాలు జరిగాయి. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా సెగలు రేపుతోంది. అన్ని వేళ్లూ కేసీఆర్ వైపు చూపిస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ విజిలెన్స్‌కు ఓ ఫిర్యాదు అందింది. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అవినీతి అంతా ఇంతా కాదని, ఏ సంస్థలో చూసినా కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అందులో వివరించారు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్. ఆయన ఇచ్చిన కంప్లయింట్ ఆధారంగా, మాజీ మంత్రి కేటీఆర్ బడా అడ్బర్టైజ్‌మెంట్ కంపెనీలైన లీడ్ స్పేస్, ప్రకాష్ ఆర్ట్స్‌లను పెంచి పోషించారు. వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశారు.

కేటీఆర్ కనుసన్నల్లోనే అంతా!

హైదరాబాద్ మహానగరంలో మెట్రో స్టేషన్ల వద్ద, బస్టాండ్ల వద్ద ప్రజల దృష్టిపడే విధంగా ఉండే ప్రదేశాలలో పెద్ద పెద్ద అడ్వర్టైజ్‌మెంట్ బోర్డులతో లీడ్ స్పేస్, ప్రకాష్ ఆర్ట్స్, ఇంకొన్ని పెద్ద కంపెనీలకు మాత్రమే అనుమతులు అందాయి. ఇదంతా కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగింది. కోట్ల రూపాయల అవినీతి పథకం రూపొందించి దోచేశారు. చిన్న చిన్న అడ్వర్టైజ్‌మెంట్ కంపెనీలు కనుమరుగయ్యేలా చేశారు. జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా కొందరు అవినీతి అధికారుల సహాయ సహకారాలతో ఈ దందా సాగింది. వెంటనే కోట్ల రూపాయల అవినీతిని బయటపెట్టాలని వాటిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టిన అధికారులపై, మాజీ మంత్రి కేటీఆర్‌పై, బడా అడ్వర్టైజ్‌మెంట్ కంపెనీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని బక్క జడ్సన్ కోరారు.

అక్రమాలకు చెక్ పడాలి!

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు రక్షణగా ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు జడ్సన్. పేద, మధ్యతరగతి వారు ఏర్పాటు చేసుకున్న చిన్న చిన్న అడ్వర్టైజ్‌మెంట్ కంపెనీలను కాపాడి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పూర్తి కథనం…

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు