Ys Jagan
ఆంధ్రప్రదేశ్

Ys Jagan | కూటమి హయాంలో రైతులకు అన్యాయం.. జగన్ ఘాటు వ్యాఖ్యలు..!

Ys Jagan | ఏపీలో కూటమి ప్రభుత్వ హయాంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఘాటు విమర్శలు చేశారు. బుధవారం గుంటూరు మిర్చియార్డుకు వెళ్లిన జగన్.. అక్కడ రైతులను పరామర్శించారు. రైతలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిర్చికి గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు జగన్ కు విన్నవించారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు.

‘కూటమి హయాంలో రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. అసలు రైతులు బతికే పరిస్థితి కనిపించడం లేదు. ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడు. వైసీపీ (ycp) హయాంలో రైతులకు కల్పించిన సదుపాయలు అన్నీ తీసేశారు. ఆర్బీకే లాంటి వ్యవస్థలను కావాలనే నిర్వీర్యం చేసేసి.. దళారుల వ్యవస్థను తీసుకొస్తున్నారు. గత ఐదేళ్లలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదు. రైతులకు వైసీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇస్తున్నా. ప్రభుత్వం మెడలు వంచి రైతులకు లాభం జరిగేలా చూస్తాం’ అంటూ జగన్ వ్యాఖ్యలు చేశారు. ఇక జగన్ మిర్చి యార్డుకు వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు వచ్చారు.

జగన్ చేసిన వ్యాఖ్యలతో అటు కూటమి నేతలు కూడా కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. గుంటూరు మిర్చియార్డులో రైతుల పరిస్థితులపై అటు ప్రభుత్వం కూడా నివేదిక కోరినట్టు తెలుస్తోంది. జగన్ నిన్న విజయవాడ సబ్ జైలుకు వెళ్లిన తర్వాత నేడు గుంటూరు (guntur) మిర్చియార్డుకు వెళ్లారు. ఇక నుంచి రెగ్యులర్ గా ఏదో ఒక రాజకీయ యాక్టివిటీస్ ఉంటాయని తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత రాష్ట్రమంతా పర్యటనలు ఉంటాయని చెప్పిన జగన్.. కాస్త ఆలస్యంగా అయినా ప్రజల్లో తిరుగుతున్నారని వైసీపీ శ్రేణులు సంతోషిస్తున్నారు.

అయితే జగన్ పర్యటనలపై అటు కూటమి ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ గత ఐదేళ్లలో తెచ్చిన సమస్యలపైనే ఇప్పుడు ఆయన మళ్లీ మాట్లాడుతున్నారంటూ ఇప్పటికే కూటమి నేతలు చెబుతున్నారు. జగన్ చేసిన ప్రతి వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో రచ్చ జరిగేలా కూటమి నేతలు ప్లాన్ చేస్తున్నారంట. జగన్ గతంలో ఏం చేశాడో.. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడో అనేవి బయటపెట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ