Rajamouli-Rashmi
ఎంటర్‌టైన్మెంట్

Rajamouli X Rashmi: రష్మీతో రాజమౌళి జింతాతా.. వైరల్ వీడియో

Rajamouli X Rashmi: దర్శక ధీరుడు రాజమౌళి ( SS Rajamouli) ప్రస్తుతం విదేశాల్లో మహేష్ బాబు ‘SSMB 29’ ప్రాజెక్ట్ షూట్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నా ప్రపంచ వ్యాప్తంగా తన గురించి, తన సినిమాల గురించి చర్చ జరుగుతుంది. ఇది పక్కనా పెడితే.. సినీ ప్రవేశం చేయకముందు రాజమౌళి సీరియల్స్‌కు పని చేసిన విషయం తెలిసిందే. కేవలం అసిస్టెంట్ డైరెక్టర్‌గానే కాకుండా ఆయన ‘శాంతి నివాసం’ అనే సీరియల్‌ని కూడా డైరెక్ట్ చేశాడు. అలాగే ‘అమృతం’ వంటి సీరియల్‌లలో అప్పుడప్పుడు నటుడిగా మెరిశాడు కూడా. ప్రస్తుతం ఆయన గతంలో ఓ హాట్ బ్యూటీతో నటించిన సన్నివేశం ట్రెండింగ్‌గా మారింది.

స్మాల్ స్క్రీన్ బ్యూటీ రష్మీ(Rashmi Gautam)కెరీర్‌లో చాలా వరకు సక్సెస్ అయ్యింది. మరి ఈ సక్సెస్ అంతా ఈజీగా రాలేదు. ఆమె కూడా అనేక సీరియల్స్‌లో నటిగానే కెరీర్‌ని ఆరంభించారు. అయితే ఆమె నటించిన ‘యువ’ అనే యూత్‌ఫుల్‌ సీరియల్ లో రాజమౌళి మెరిశాడు. వీరిద్దరి మధ్యలో లవ్ ట్రాక్ నడుస్తుంది. రాజమౌళి, రష్మీ మధ్యలో విక్రమార్కుడు సినిమాలోని ‘జింతాతా’ జింగిల్ డ్రీమ్ సీక్వెన్స్ ఉంటుంది. ఎక్కడి నుంచి తవ్వరో, ఎప్పుడు తవ్వరో తెలీదు కానీ సోషల్ మీడియా వీరులు దీన్ని వెలికి తీసి ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు.

ఇక రాజమౌళి, మహేష్ బాబు(Mahesh Babu) సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం కెన్యాలోని ఓ వైల్డ్ పార్కులో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. ఈ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా విలన్‌గా నటిస్తున్నట్లు టాక్. పృథ్వీ‌రాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహేష్‌కు జోడిగా ఓ విదేశీ భామను రాజమౌళి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్‌పై కె.ఎల్‌.నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి: 

Laila Movie: డామిట్.. ‘లైలా’ బట్టలు, మేకప్ ఖర్చు కూడా రాలేదా?

Harish Shankar Leaks: ఆశలు పెట్టుకోకు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’లో ఆ సీన్ వాడేశా!

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!