Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna).. టాలీవుడ్‌లో మోస్ట్ ఎక్స్పరిమెంటల్ హీరో. సినిమాల విషయంలో ఆయన చేసినన్ని ప్రయోగాలు ఏ హీరోకు సాధ్యం కాలేదు. కొన్ని కొన్ని సార్లు ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి దిగ్గజ నటులు కూడా కృష్ణ వేసిన పాత్రలను మనం వేయలేకపోయామని బాధపడేవారట. ఇక కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రతో హిస్టారికల్ హిస్టరీ సాధించాడు. ఈ సినిమాను చూసిన ఎన్టీఆర్ ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో నటించే ప్రయత్నాన్ని విరమించుకున్నడంటే.. కృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి కృష్ణకు ఒక బలమైన కోరిక ఉండేది.. ఆయన దాన్ని నెరవేర్చుకోలేకపోయాడు. ఇంతకీ ఆ కోరిక ఏంటంటే..
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ(Chhatrapati Shivaji Maharaj) వీరగాథను తెరకెక్కించడం కృష్ణ గారి డ్రీమ్. దాని కోసం అనేక ప్రయత్నాలు కూడా చేశాడు కానీ.. సక్సెస్ కాలేకపోయాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిదం అనుకున్న.. అనేక అవాంతరాలు ఏర్పడ్డాయి. అలాగే మార్కెట్ వర్కౌట్ కాదు అనే అనుమానాలను సన్నిహితులు వ్యక్తపరిచేవారట. దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న ఆయన.. నెంబర్ వన్, చంద్రహాస్ సినిమాల్లో శివాజీ గెటప్ వేసి సంతృప్తి పడ్డారట. కానీ..
ఈ నేపథ్యంలోనే కృష్ణ, మహేష్(Mahesh Babu) అభిమానులు ఛత్రపతి పాత్రలో నటించి.. కృష్ణ కలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా గత కొన్ని సంవత్సరాల నుంచి శివాజీ సెంటిమెంట్ దక్షిణాది రాష్ట్రాలపై కూడా బాగా పెరిగింది. దీంతో మార్కెట్ గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఒక మంచి దర్శకుడు మహేష్ కు తగిలి ఈ ప్రాజెక్ట్ ముందుకు వస్తే.. విధ్వంసం ఏర్పడటం ఖాయం.
Also Read- Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆ ఫోబియా పోలేదా!
అజయ్ దేవగన్ ‘తానాజీ’తో మరాఠా వీరుల కథలను జనాలు ఎంతగా ఆదరిస్తారో అర్థమైపోయింది. అంతకు ముందే సంజయ్ లీల భన్సాలీ తెరకెక్కించిన ‘ బాజీ రావ్ మస్తాన్’ సినిమా గొప్పగా ఉన్నా ప్రేమ కథను హైలెట్ చేశారు. ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ ను ఊచకోత కోస్తున్న విక్కీ కౌశల్ ‘ఛావా’ (Chhaava) మరో ఉదాహరణ. ఈ నేపథ్యంలోనే రాజమౌళి ‘SSMB 29’ తర్వాత మహేష్ ఈ ప్రాజెక్ట్ చేస్తే చాలా బాగుంటుందని పలువురు అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు. అప్పటి వరకు విక్కీ కౌశల్ ‘ఛావా’ ట్రాన్స్ నుండి జనాలు కోలుకుంటారు కాబట్టి ఫ్రెష్ గా స్టార్ట్ చేయొచ్చు అంటున్నారు. ఇప్పటికే బీ టౌన్ లో నిర్మాతలు మరాఠా యోధుల కథలను వెలికి తీయండని రైటర్స్ కు పని చెప్తున్నారట.
ఇవి కూడా చదవండి:
Laila Movie: డామిట్.. ‘లైలా’ బట్టలు, మేకప్ ఖర్చు కూడా రాలేదా?
Harish Shankar Leaks: ఆశలు పెట్టుకోకు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఆ సీన్ వాడేశా!