Kiran Abbavaram: టీజర్, ట్రైలర్‌లో ఏదయితే చూపించామో అదే సినిమాలో ఉంటుంది.. ఎక్కడా అనవసరపు కంటెంట్ పెట్టలేదని అన్నారు హీరో కిరణ్ అబ్బవరం. ‘క’ సక్సెస్ తర్వాత ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘దిల్ రూబా’ (DilRuba). రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్‌తో కలిసి సారెగమకు చెందిన ఏ యూడ్లీ ఫిలిం నిర్మిస్తోంది. విశ్వ కరుణ్ దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలు నిర్మిస్తున్నారు. మార్చి 14న హోలీ పండుగ స్పెషల్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఈ మూవీ నుండి సెకండ్ సింగిల్ ‘హే జింగిలి’ని మంగళవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన వేడుకలో విడుదల చేశారు.
Also Read- Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆ ఫోబియా పోలేదా!
ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ఈ మూవీ చేసినందుకు చాలా గర్వంగానూ, హ్యాపీగానూ ఫీలవుతున్నాను. ఇది ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీ. సారెగమా వాళ్లు ఫస్ట్ టైమ్ ఈ మూవీతో టాలీవుడ్‌లోకి నిర్మాతలు వస్తున్నారు. ప్రొడ్యూసర్ రవి, డైరెక్టర్ విశ్వకరుణ్ మూడేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడ్డారు. వాళ్ల కోసమైనా ఈ మూవీ తప్పకుండా ఆడాలి. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నాం. కానీ, కంగారు కంగారుగా మూవీని రిలీజ్ చేయడం ఎందుకని ఆగాం. సంక్రాంతి సినిమాలు కంప్లీట్ అయ్యాక, కంటెంట్‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని, ప్రమోషన్ ప్లాన్ చేసుకుని మార్చి 14న హోలీ పండుగ రోజున రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాం.హోలీ మంచి డేట్‌గా భావిస్తున్నాం.
నిర్మాతల సపోర్ట్‌తో ఎలాంటి తొందరపాటు లేకుండా మూవీని విడుదల చేయబోతున్నాం. రుక్సార్‌తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ‘హే జింగిలి’ పాటలో మా పెయిర్ చాలా బాగుంటుంది. భాస్కరభట్ల నన్ను బ్రదర్‌లా భావిస్తుంటారు. ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ నుండి మేము ట్రావెల్ చేస్తున్నాం. నా మూవీకి పాట రాసేప్పుడు ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఆయనకు పాట రాస్తున్నారంటే, నేను నిశ్చింతగా ఉంటాను. సామ్ సీఎస్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ‘అగ్గిపుల్లె’ ఛాట్ బస్టర్ అయ్యింది. ‘హే జింగిలి’ కూడా మంచి స్పందనను రాబట్టుకుంటోంది. త్వరలోనే థర్డ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నాం. సామ్ సీఎస్ బీజీఎం చూశాక ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్లలో మరింతగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం కలిగింది. నా సినిమాలన్నింటిలోకి ‘దిల్ రూబా’లో ఇంటెన్స్ క్యారెక్టర్ చేశాను. నా పాత్రలాగే యాక్షన్ ఎపిసోడ్స్ ఇంటెన్స్‌గా ఉంటాయి. పృథ్వీ మాస్టర్ ఇందులో చాలా కొత్తగా ఫైట్స్ డిజైన్ చేశారు. ఈ సినిమాకు మొదటి నుండి మేము టీజర్, ట్రైలర్‌లలో ఏది అయితే చూపించామో అదే సినిమాలో ఉంటుంది తప్పితే ఎక్కడా అనవసరపు కంటెంట్ పెట్టలేదు. మా కంటెంట్ మీకు నచ్చితే మార్చి 14న థియేటర్స్‌లో ఈ సినిమాను చూసి సపోర్ట్ చేయండని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
Laila Movie: డామిట్.. ‘లైలా’ బట్టలు, మేకప్ ఖర్చు కూడా రాలేదా?
Harish Shankar Leaks: ఆశలు పెట్టుకోకు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఆ సీన్ వాడేశా!