Mazaka Movie Still
ఎంటర్‌టైన్మెంట్

Mazaka Song: మాస్ డ్యాన్స్ నెంబర్‌‌లో దుమ్ములేపారు

Mazaka Song: యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా, రీతూ వర్మ హీరోయిన్‌గా రూపుదిద్దుకుంటోన్న సినిమా ‘మజాకా’. సందీప్ కిషన్‌కి ఇది 30వ సినిమా. రావు రమేష్, అన్షు (‘మన్మథుడు’ ఫేమ్) ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజతో ‘ధమాకా’ వంటి బ్లాక్ బస్టర్‌ని తెరకెక్కించిన త్రినాధరావు నక్కిన ఈ చిత్రానికి దర్శకుడు. మహా శివరాత్రి స్పెషల్‌గా ఫిబ్రవరి 26న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌‌ని గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా మీడియా సమక్షంలో ఓ సాంగ్‌ని షూట్ చేసి, వెరైటీగా ప్రమోషన్స్‌ని నిర్వహిస్తున్న మేకర్స్, మంగళవారం సినిమాలోని ఓ ఎనర్జిటిక్ మాస్ డ్యాన్స్ నెంబర్‌ ‘పగిలి’ని విడుదల చేశారు.

Also Read-  Allu Arjun: ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌కు ఆ ఫోబియా పోలేదా!

‘పగిలి’ పాట విషయానికి వస్తే.. లియోన్ జేమ్స్ ఈ సాంగ్‌ను మాస్ డ్యాన్స్ నెంబర్‌గా కంపోజ్ చేయగా.. మహాలింగం, సాహితీ చాగంటి, ప్రభ పవర్ ఫుల్ వోకల్స్ అందించారు. కాసర్ల శ్యామ్, ప్రసన్న కుమార్ బెజవాడ అందించిన సాహిత్యం, మాస్ ప్రేక్షకులకు ఊపు తెప్పించేలా ఉంది. అలాగే సందీప్ కిషన్, రీతూ వర్మ కెమిస్ట్రీ, ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ మూమెంట్స్ హైలెట్ అనేలా ఉన్నాయి. మ్యాసీవ్ అండ్ వైబ్రెంట్ సెట్స్‌లో ఈ పాటను చిత్రీకరించారు. కలర్ ఫుల్ విజువల్స్‌కు తగినట్లుగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ గ్రేస్ ఫుల్‌గా వుంది. ఈ పాట థియేటర్స్‌లో ప్రేక్షకులతో ఈలలు వేయిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

సెన్సార్ టాక్ ఏంటంటే..
‘మజాకా’ మూవీ ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ బోర్డ్ నుండి ఈ సినిమాకు యుబైఏ సర్టిపికేట్ వచ్చినట్లుగా మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాను సెన్సార్ చేసిన వారు.. హెల్దీ కామెడీతో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్‌‌తో సినిమా చాలా బావుందని తెలిపినట్లుగా సమాచారం. త్రినాధ రావు నక్కినతో విజయవంతమైన ప్రాజెక్టులలో కొలాబరేట్ అయిన రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి: 

Laila Movie: డామిట్.. ‘లైలా’ బట్టలు, మేకప్ ఖర్చు కూడా రాలేదా?

Harish Shankar Leaks: ఆశలు పెట్టుకోకు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’లో ఆ సీన్ వాడేశా!

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?