Producer SKN
ఎంటర్‌టైన్మెంట్

Producer SKN: పులిహోర కబుర్లు పక్కనెట్టి.. ఆ మాట ఎందుకన్నావో చెప్పు?

SKN Explanation: రీసెంట్‌గా జరిగిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో తెలుగు అమ్మాయిలను ఉద్దేశిస్తూ నిర్మాత ఎస్‌కెఎన్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన విషయం తెలిసిందే. పొరిగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా మన దర్శకనిర్మాతలు తెలుగు వాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టుకుంటున్నారంటూ ఇటీవల కాలంలో సీనియర్ నటీనటులు చాలా మంది ఇంటర్వ్యూలలో అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో నిర్మాత ఎస్‌కెఎన్ తెలుగు వారిని కాకుండా, తెలుగురాని వారిని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నామని చెప్పడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలపై వివరణ ఇచ్చేందుకు తాజాగా ఆయన సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు. తన ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఓ వీడియోని విడుదల చేసిన ఎస్‌కెఎన్.. సరదాగా చేసిన వ్యాఖ్యలపై ఇలా దుష్ప్రచారం చేయవద్దు అంటూ చెప్పుకొచ్చారు.

Also Read-  Allu Arjun: ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌కు ఆ ఫోబియా పోలేదా!

అయినా సరే, నెటిజన్లు మాత్రం ఎస్‌కెఎన్‌ని వదిలిపెట్టడం లేదు. ఒకసారి అన్న తర్వాత కామ్‌గా ఉంటే సరిపోయేది. ఇప్పుడు మళ్లీ కెలుక్కోవడంతో, ఎస్‌కెఎన్‌పై ప్రశ్నల వర్షం సంధిస్తున్నారు. ‘ఆ పులిహోర కబుర్లు ఆపి.. అసలు అంత పెద్ద వేడుకలో ఆ మాట ఎందుకన్నావో చెప్పు? విషయం ఏదో ఉంది. అదేం లేకుండా అంత పెద్ద మాట, అందునా ‘బేబి’ దర్శకుడు సాయి రాజేష్‌ని కూడా కలిపి మరీ అన్నావు కాబట్టి.. అది సరదాగా అన్నావని ఎలా అనుకుంటాం. నువ్వు ఎంతో మంది తెలుగువారిని పరిచయం చేశానని చెబుతున్నావ్. ఎప్పుడూ కూడా అలాంటి మాట మాట్లాడలేదు. కేవలం ఇప్పుడు మాత్రమే ఎందుకు అన్నావ్. ముందు దానిపై వివరణ ఇవ్వు’ అంటూ ఎస్‌కెఎన్‌ను నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు. టంగ్ స్లిప్ అనుకోవడానికి ఆస్కారం లేనంతగా వ్యాఖ్యలు చేసిన నిర్మాత ఎస్‌కెఎన్, ఆ మాటలపై వివరణ ఇస్తాడా? వాళ్లని అంతగా ఇబ్బంది పెట్టిన తెలుగు నటి ఎవరో చెబుతాడా? అసలు ఎస్‌కెఎన్ విడుదల చేసిన వీడియోలో ఏమని వివరణ ఇచ్చాడంటే..

‘‘రీసెంట్‌గా నేను ఓ వేడుకలో మాట్లాడిన మాటలని తప్పుగా చిత్రీకరిస్తున్నారు. తెలుగు అమ్మాయిలతో పనిచేయను, వాళ్లతో ఇబ్బందిగా ఉంది అని నేను అన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో నేను పరిచయం చేసినట్లుగా వేరే ఏ నిర్మాత తెలుగు అమ్మాయిలని ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. ‘రేష్మ, ఆనంది, మానస, ప్రియాంకా, వైష్ణవి చైతన్య, ఖుషిత, ఐశ్వర్య వంటి వారినంతా నేనే ఇండస్ట్రీకి పరిచయం చేశాను. సుమారు 10 నుండి 12 మంది వరకు నేను తెలుగు అమ్మాయిలని ప్రేక్షకులకు పరిచయం చేశాను. అందరినీ నా తరపున ప్రోత్సహించాలని అనుకున్నాను. మేము పరిచయం చేశాం కదా అని స్టార్ హీరోయిన్లు అయిపోరు. అలా అనీ అసలు అవకాశాలు రాకుండా కిందకీ వెళ్లిపోరు. ఎవరికైనా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేందుకు వచ్చే మొట్ట మొదటి అవకాశం ఎంతో ముఖ్యం. అది నేను కల్పిస్తూ వస్తున్నాను. నా రాబోయే మూడు సినిమాలలోనూ తెలుగు అమ్మాయిలే ఉన్నారు. ఏదో ఆ వేదికపై మాట్లాడిన మాటలని స్టేట్‌మెంట్స్‌గా తీసుకుని నాపై దుష్ర్పచారం చేస్తున్నారు. దయచేసి అలా చేయవద్దు..’’ అని ఎస్‌కెఎన్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి: 

Laila Movie: డామిట్.. ‘లైలా’ బట్టలు, మేకప్ ఖర్చు కూడా రాలేదా?

Harish Shankar Leaks: ఆశలు పెట్టుకోకు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’లో ఆ సీన్ వాడేశా!

 

Just In

01

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!