Ysrcp
ఆంధ్రప్రదేశ్

Ysrcp | రాత్రి 7గంటలకు బిగ్ బ్లాస్ట్ అంటూ వైసీపీ పోస్ట్.. ఏం జరుగుతోంది..?

Ysrcp | వైసీపీ ట్విట్టర్ లో సంచలన పోస్టు పెట్టింది. ఈ రోజు రాత్రి 7 గంటలకు బిగ్ బ్లాస్ట్ అంటూ రాసుకొచ్చింది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకీ వైసీపీ దేని గురించి ఈ పోస్టు పెట్టిందా అని అంతా ఆరా తీస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ (ys jagan) మోహన్ రెడ్డి నేడు విజయవాడ సబ్ జైలులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని (vamshi) పరామర్శించనున్నారు. ఆయన పరామర్శకు గంట ముందు వైసీపీ ఈ పోస్టు పెట్టింది. గన్నవరం కేసులో అసలు ఏం జరిగిందో సంచలన నిజాన్ని బయటపెడుతామంటూ దాని కింద రాసుకొచ్చింది.

గన్నవరం టీడీపీ ఆఫీసుమీద దాడి కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు. ఆయనతో పాటు చాలా మందిమీద కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులో తమ నేతలది తప్పు కాదు అన్నట్టు వైసీపీ చెబుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో తమ వద్ద ఉందంటూ కొన్ని రోజులుగా ప్రచారం చేసుకుంటోంది. అయితే రాత్రి 7గంటల సమయంలో వైసీపీ ఆ వీడియోనే బయట పెట్టబోతుందేమో అని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చకు దారి తీసింది.

వైసీపీ ఏం బయటపెడుతుందో.. ఎవరి పేర్లను తెరమీదకు తెస్తుందో అనే కొత్త టెన్షన్ మొదలైంది. అటు వంశీకి వ్యతిరేకంగా చాలా రకాల ఆధారాలు సేకరిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. చూస్తుంటే ఇప్పట్లో వంశీ బయటకు వచ్చే అవకాశాలే లేవని తెలుస్తోంది. కానీ వైసీపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వంశీని బయటకు తీసుకురావాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఈ పోస్టు పెట్టినట్టు సమాచారం.

Just In

01

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!