Merciless Ex minister errabelli Dayakar Rao
Politics

Merciless : దయలేని దయాకర్ రావు..!

– మాజీమంత్రి ఎర్రబెల్లి దౌర్జన్యం
– మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావుతో కలిసి రియల్‌ ఎస్టేట్ వ్యాపారికి బెదిరింపులు
– సీఎం, డీజీపీకి ఫిర్యాదు చేసిన బాధితుడు శరణ్ చౌదరి
– బాధితుడి ఫ్లాట్‌ను ఎర్రబెల్లి బంధువు విజయ్‌కు ఇవ్వాలని ఒత్తిడి
– రెండు రోజులు సీసీఎస్‌లోనే ఉంచి హింసించారంటున్న శరణ్ చౌదరి
– రిజిస్ట్రేషన్‌కు ఒప్పుకున్న తర్వాతే విడిచిపెట్టారని ఆవేదన
– తన కుటుంబాన్ని బెదిరించి రూ.50 లక్షలు వసూలు చేశారని ఆరోపణ
– హైకోర్టులో రిట్ పిటిషన్‌ వేస్తే వెనక్కి తీసుకునేలా బెదిరింపులు
– శరణ్ పిర్యాదుపై స్పందించిన పోలీసులు
– పూర్తి వివరాలు, ఆధారాలు సమర్పించాలని ఆదేశం

Merciless Dayakar Rao : దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. దీంతో గత పదేళ్లుగా నగరంలో భూములకు అమాంతం రెక్కలొచ్చాయి. రియల్ ఎస్టేట్ రంగం జోరు కొనసాగింది. చిన్న జాగా కనిపిస్తే చాలు, కొనేయడమో, కబ్జా చేసి కొట్టేయడమో లాంటివి చాలానే జరిగాయి. బెదిరింపులు, దాడులు ఇలా ఎన్నో ఘటనలు వివాదాలకు దారి తీశాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల పేర్లు భూ వివాదాల్లో ఎక్కువగా వినిపించేవి. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం మారడంతో బాధితులంతా మీడియా ముందుకొస్తున్నారు.

తాజాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సంబంధించిన వ్యవహారం తెరపైకొచ్చింది. ఎర్రబెల్లి ఆదేశాలతో అప్పటి డీసీపీ రాధా కిషన్‌ రావు తన ఫ్లాట్‌ను లాక్కోవడమే కాక, తన కుటుంబం నుంచి 50 లక్షలు వసూలు చేశారంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి అంటున్నారు. దీనిపై సీఎంం రేవంత్‌ రెడ్డికి, డీజీపీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. శరణ్ చౌదరి హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. గతేడాది ఆగస్టు 21న ఆఫీస్‌‌కు వెళ్తుండగా సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులు వచ్చి బలవంతంగా సీసీఎస్ ఆఫీస్‌కు తీసుకెళ్లారంటూ మెయిల్‌లో ఆరోపించారు.

Read Also : ఎమ్మెల్సీ ఉపఎన్నిక వార్

రెండు రోజుల పాటు ఏసీపీ ఉమామహేశ్వరరావు తనను హింసించాడని, తన పేరిట ఉన్న ఫ్లాట్‌ను ఎర్రబెల్లి బంధువు విజయ్ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి చేశాడన్నారు. తాను అంగీకరించనందుకు బూటు కాళ్లతో తన్నారని, విపరీతంగా కొట్టారని కంప్లయింట్ చేశారు. చివరకు రిజిస్ట్రేషన్ చేస్తానని ఒప్పుకున్నాకే వదిలి పెట్టారని, తనును బంధించిన సమయంలో కుటుంబాన్ని బెదిరించి 50 లక్షలు కూడా వసూలు చేశారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టులో రిట్ పిటిషన్‌ కూడా వేశానని, కానీ తనను బెదిరించి దాన్ని వెనక్కి తీసుకునేలా చేశారన్నారు.

ఇదంతా అప్పటి మంత్రి ఎర్రబెల్లి, డీసీపీ రాధాకిషన్‌ రావు ఆదేశాలతోనే జరిగిందని వారిపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం, డీజీపీని కోరారు శరణ్‌. దీనిపై ‘స్వేచ్ఛ’ ఆయన్ను సంప్రదించగా, ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసుల నుంచి స్పందన వచ్చిందన్నారు. రాధాకిషన్‌ రావుతో కలిసి ఎర్రబెల్లి చేసిన అరాచకాలపై ఆధారాలు ఇవ్వాలని కోరారని, తాను దుబాయ్‌ నుంచి రాగానే వాటిని అందజేస్తానని చెప్పినట్టు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత సర్కారు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకుంటున్నారని, తనకు జరిగిన అన్యాయంపై కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ ఫిర్యాదు చేశానని తెలిపారు శరణ్‌ చౌదరి.

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?