Klin Kaara: మెగా గారాల పట్టి, మెగా ప్రిన్సెస్ క్లీంకారా ఫేస్ రివీలైంది. మెగాస్టార్ చిరంజీవి మనవరాలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు కుమార్తె క్లీంకార ఫేస్‌ని ఇప్పటి వరకు ఆ ఫ్యామిలీ మెంబర్స్ రివీల్ చేయలేదు. క్లీంకార పలు మార్లు బయట కనిపించినా.. ఎప్పుడూ ఫేస్ కవర్ చేస్తూ ఫ్యామిలీ మెంబర్స్ జాగ్రత్త పడుతూ వచ్చారు. ముఖ్యంగా ఉపాసన తన కుమార్తెని తీసుకుని ఎక్కడ కనిపించినా కూడా ఫేస్ రివీల్ కానివ్వలేదు. తాజాగా రామ్ చరణ్ చేతుల్లో ఉన్న క్లీంకార ఫేస్ రివీలై, టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారింది. రీసెంట్‌గా ఓ వేదికపై క్లీంకార ఫేస్‌ను ఎప్పుడు రివీల్ చేస్తారనే విషయంపై రామ్ చరణ్ ఓ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, ఆయన చెప్పిన వరకు క్లీంకార ఫేస్ కవర్ చేయకుండా ఉండలేకపోయారు.
Also Read- Manchu Manoj: ఇది ఆస్తి గొడవ కాదు.. ఎమ్మెల్యేకి మంచు మనోజ్ రిక్వెస్ట్
తాజాగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రామ్ చరణ్ చేతుల్లో ఉన్న ఆయన కుమార్తెను కొందరు వీడియో తీసి నెట్‌లో పోస్ట్ చేశారు. ఈ సారి ఫేస్‌కి ఏం కవర్ చేయకుండానే రామ్ చరణ్ ఎత్తుకుని తీసుకువెళుతుండటంతో, వెంటనే అలెర్ట్ అయినా వారు తమ కెమెరాలలో క్లీంకారను బంధించి, సోషల్ మీడియాలో వీడియోలు వదలడంతో, మెగా ఫ్యాన్స్ అందరూ షాకయ్యారు. తమ హీరో అనుకున్న మాట నెరవేరలేదని కొందరు ఫ్యాన్స్ బాధపడుతుంటే, మరికొందరు ఫ్యాన్స్ మాత్రం క్లీంకార ఎంత క్యూట్‌గా ఉందో, సేమ్ రామ్ చరణ్ ఫేస్ కట్టే, రామ్ చరణ్ కళ్లే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్లీంకార ఫేస్‌ను ఎంతగా దాచాలని చూసినా.. ఇలా రివీల్ కావడంపై మెగా ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
ఆ కిక్కు పోయినట్టే!
ఎప్పుడైతే క్లీంకార తనని ‘నాన్న’ అని పిలుస్తుందో.. అప్పుడు మాత్రమే ఫేస్ రివీల్ చేస్తామని రామ్ చరణ్ ఇటీవల ఓ వేదికపై ప్రకటించారు. రామ్ చరణ్‌కి ఆ కిక్కు దక్కకుండానే.. కొందరు ఆమె ఫేస్‌ని రివీల్ చేసి, గ్లోబల్ స్టార్‌కి సైతం షాకిచ్చారు. ఒక్కసారి రివీలైతే.. ఇప్పుడు సోషల్ మీడియా ధాటికి తట్టుకోవడం కష్టం. అసలే ఈ మధ్య రిలీజైన సినిమానే రెండు గంటల్లో హెచ్‌డి ప్రింట్స్‌తో సోషల్ మీడియాల్లో పెట్టేస్తున్నారు. అలాంటిది, మెగా ఫ్యామిలీ దాచాలనుకున్న క్లీంకారా ఫేస్ రివీలైతే ఊరుకుంటారా? వైరల్ చేసేస్తున్నారు. పాప కనిపించింది ఒక్క వీడియోలోనే కానీ.. ఆ పాపకు సంబంధించి ఇతర ఈవెంట్స్‌లోని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తుండటం గమనార్హం.
కారా పాప దర్శనం…🥺❤️
Same నీ కళ్ళు అన్న @AlwaysRamCharan 🥹#RamCharan #GlobalStarRamCharan pic.twitter.com/JGNrZrvpXP
— EshwaRC16 Raj(Dhfc) 🐎 (@EshwarDhfc) February 14, 2025