Nag Ashwin X Alia bhatt | పాన్ ఇండియాకు దారి ఇదేనా..
Ali-Bhatt
ఎంటర్‌టైన్‌మెంట్

Nag Ashwin X Alia bhatt: పాన్ ఇండియాకు దారి ఇదేనా..

Nag Ashwin X Alia bhatt: ‘కల్కి 2898 AD’ మూవీతో సెన్సేషనల్ హిట్ అందుకున్న నాగ్ అశ్విన్ ప్రస్తుతం ‘కల్కి 2’ పనుల్లో నిమగ్నమయ్యాడు. ప్రభాస్ కాస్త ఫ్రీ కాగానే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది. అనంతరం నాగి.. ఆలియా భట్‌తో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అయితే వై ఆలియా భట్ (Why Alia Bhatt) అనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు నెటిజన్లు కొందరు. ఇప్పటికే ‘కల్కి’ ఫస్ట్ పార్ట్‌లో దీపికా పదుకొణెని తీసుకున్న నాగి మరోసారి బాలీవుడ్ ‌భామనే సెలెక్ట్ చేయడానికి కారణం పాన్ ఇండియా మార్కెట్‌ని అట్రాక్ట్ చేయడం కోసమే అనేలా టాక్ వినబడుతోంది.

ఆలియా భట్, నాగ్ అశ్విన్ ఇద్దరు ఇద్దరే. టాలెంట్‌‌కి కేరాఫ్ అడ్రస్‌గా వారిని చెప్పుకోవచ్చు. అలియా భట్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో సౌత్‌లో డెబ్యూ చేసి మంచి పేరును సంపాదించుకుంది. ఒక నటిగా జాతీయ స్థాయిలో గొప్ప పేరు సంపాదించాలంటే ఒకే ఇండస్ట్రీకి పరిమితం అయితే సాధ్యం కాని పని. ఈ నేపథ్యంలోనే ఆమె విలక్షణ పాత్రలు, సినిమాలతో పాటు బహుభాషా చిత్రాలను సైన్ చేస్తోంది. అయితే నాగి టాలెంట్‌కు పాన్ ఇండియా కాన్వాస్ సరైనదే కానీ.. ఆ కాన్వాస్‌పై సినిమాలు తీయాలంటే తప్పనిసరిగా బాలీవుడ్ భామలనే సెలెక్ట్ చేయడం కరెక్టేనా అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాలెంటెడ్ భామలే లేరా అని ప్రశ్నిస్తున్నారు. టాలీవుడ్ భామలను సెలెక్ట్ చేస్తే.. సౌత్ స్టార్స్‌కు పాన్ ఇండియన్ వైడ్‌గా మంచి స్పేస్ దక్కుతుందనే ఉద్దేశ్యాన్ని వ్యక్తపరుస్తున్నారు.

కల్కి 2 ఎప్పుడంటే..

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ‘కల్కి 2’ గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ” ‘కల్కి 2’కి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన వివరాలను తెలియజేస్తాం. ఈ గ్యాప్‌లో వేరే సినిమా చేసే ఛాన్సే లేదు. ఎందుకంటే.. ఈ ఒక్క సినిమా రెండు ప్రాజెక్ట్స్‌తో సమానం” అంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ప్రభాస్ ప్రిఫరెన్సులను బట్టి చూస్తే.. ఎంత లేదనుకున్న ‘కల్కి 2’ సినిమా విడుదలడానికి ఇంకో రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. దీంతో ఆలియాతో ఆయన సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. నాగి చెప్పిన ప్రకారం చూస్తే.. ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ 2027 లేదా 2028లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అప్పటికీ ఈ ప్రాజెక్ట్ ఉంటుందో, ఉండదో కూడా డౌటే.

ఇవి కూడా చదవండి: 

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ‘వాలెంటైన్స్ డే’ సర్‌‌ఫ్రైజ్‌ చూశారా..

Janhvi Kapoor X Pa. Ranjith: శభాష్.. బోల్డ్ స్టెప్ వేసిన జాన్వీ

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..