Allu Arjun: ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. టాలీవుడ్ ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌తో సినిమాలు చేయడానికి కోలీవుడ్ (తమిళ) స్టార్ దర్శకులు వరుస కడుతున్నారు. ఇప్పటికే అట్లీ, లోకేష్ కనగరాజ్ వంటి దిగ్గజ దర్శకులు బన్నీతో చర్చలు జరపగా, తాజాగా ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ కూడా ఈ రేసులోకి వచ్చారు. ఇటీవల సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి ఒక ఇంటర్వ్యూలో నెల్సన్ అల్లు అర్జున్‌కు కథ వినిపించారని ధృవీకరించడంతో ఈ వార్త వైరల్‌గా మారింది.
Read also-Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!
ఎందుకు ఈ క్రేజ్?
సాధారణంగా తమిళ దర్శకులు అక్కడి స్టార్ హీరోలతోనే సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ వైపు వారు చూపు సారించడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. తెలుగు హీరోలలో కేరళలో భారీ ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరో అల్లు అర్జున్. అయితే ‘పుష్ప’ సినిమా తర్వాత తమిళనాడులో కూడా ఆయనకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. అక్కడి మాస్ ఆడియన్స్‌కు బన్నీ స్టైల్, డ్యాన్స్, మేనరిజమ్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. తమిళ దర్శకులకు ఇది ఒక సిద్ధంగా ఉన్న మార్కెట్‌లా కనిపిస్తోంది.
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ త్వరలో సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్తున్నారు. కోలీవుడ్‌లో విజయ్ స్థానం భర్తీ చేయగల మాస్ ఇమేజ్, డ్యాన్స్ ఎనర్జీ ఉన్న హీరో కోసం వెతుకుతున్న దర్శకులకు అల్లు అర్జున్ బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తున్నారు. విజయ్ మార్కెట్‌ను తమ వైపు తిప్పుకోవడానికి అల్లు అర్జున్ ఒక సరైన ‘వారధి’ అని అట్లీ, నెల్సన్ వంటి దర్శకులు భావిస్తున్నారు.
Read also-Casting Couch: అప్పుడు సౌందర్య చెప్పిన మాటలేగా చిరు చెప్పింది.. ఎందుకంత రచ్చ?
పాన్-ఇండియా స్టామినా
అల్లు అర్జున్ ఇప్పుడు కేవలం సౌత్ హీరో మాత్రమే కాదు. ఉత్తరాదిలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ బాలీవుడ్ స్టార్లకు సైతం షాక్ ఇస్తోంది. ఒక తమిళ దర్శకుడు బన్నీతో సినిమా చేస్తే, అది ఆటోమేటిక్‌గా పాన్-ఇండియా లెవల్‌లో రూ.1000 కోట్ల వసూళ్ల మార్కెట్‌ను టచ్ చేసే అవకాశం ఉంటుంది. భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించే లోకేష్ కనగరాజ్ వంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశం.
లైన్లో ఉన్న ప్రాజెక్టులు
షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ వంటి భారీ హిట్ కొట్టిన అట్లీ, అల్లు అర్జున్ తో సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమా తర్వాత ‘లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే ఒక సినిమాని ప్రకటించారు. ఇప్పడు జైలర్ దర్శకుగు నెల్సన్ తో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిని బట్టి చూసుకుంటే, అల్లు అర్జున్ రేంజ్ ఎంటో అర్థం అవుతుంది. మొత్తానికి అల్లు అర్జున్ తన కెరీర్‌ను చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ దర్శకులతో పాటు, పక్క రాష్ట్రంలోని అగ్ర దర్శకులను కూడా లైన్లో పెట్టి తన గ్లోబల్ ఇమేజ్‌ను మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ ఈ కాంబినేషన్లు గనుక సెట్ అయితే, రాబోయే రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవ్వడం ఖాయం.

