Maoists surrender: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సౌత్ బస్తర్ డివిజన్ లో సుక్మ, ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసుల సంయుక్తంగా నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా నలుగురు మావోయిస్టులు లొంగిపోయినట్లు బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి.సుందర్ రాజ్ తెలిపారు. లొంగిపోయిన వారిపై నలుగురిపై రూ.8 లక్షల రివార్డు ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఐజి సుందర్ రాజ్ మాట్లాడుతూ… లొంగిపోయిన నలుగురిలో ఇద్దరు మహిళ మావోయిస్టులు ఉన్నారని వివరించారు. గోలపల్లి ఎల్ ఓ ఎస్ లో పనిచేస్తున్న కమాండర్, సభ్యులు గా ఉన్నారని చెప్పారు. వారి వద్ద నుండి ఎస్ఎల్ఆర్, ఇన్సాస్, 303, 315 బోర్ డ్రై ఫీల్స్ తో పాటు మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
మావోయిస్టులపై ఉక్కు పాదం
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో మావోయిస్టులపై ఉక్కు పాదం మోపుతున్నామని సుందర్ రాజ్ తెలిపారు. కిష్టారం, గొల్లపల్లి ప్రాంతాల్లో కొత్తగా భద్రత శిబిరాలు ఏర్పాటు చేసి ఆ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల అలసడి లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగానే పోలీసులు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ లో నలుగురు మావోయిస్టులు లొంగిపోయినట్లు వివరించారు.
Also Read: Maoists Surrender: అజ్ఞాతంలో ఉన్నవారు జన జీవనంలోకి రండి.. మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి సూచన
లొంగిపోయిన వారి వివరాలు
సుక్మా జిల్లా రాణ కిష్టారం కు చెందిన సింఘన మడుగు(ఏసీఎం) గా పనిచేస్తున్న సోది జోగా వద్ద నుండి ఎస్ఎల్ఆర్ రైఫిల్, గోలపల్లి సింగారం కు చెందిన డాబర్ గంగా అలియాస్ మడకం గంగ వద్ద నుంచి ఇన్సాస్ రైఫిల్, దానా చింత గుఫ అంత పాడ్ కు చెందిన సోది రాజే వద్ద నుంచి 303 రైఫిల్, రాణ కిష్టారం, సింఘన మడుగు కు చెందిన మద్వి బుద్రి వద్ద నుంచి త్రీ వన్ ఫైవ్ ఫోర్ రైఫిల్ లతోపాటు మందు గుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఐజి సుందర్ రాజ్ వెల్లడించారు. ఈ సందర్భంగా. ఐ జి సుందర్ రాజ్ మాట్లాడుతూ… చత్తీస్గడ్ ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస పథకాలకు మావోయిస్టులు ఆకర్షితులై హింస మార్గాన్ని వదిలిపెట్టి కొత్త జీవితం ప్రారంభిస్తున్నారని తెలిపారు.
ప్రశాంత వాతావరణంలో జీవితం గడపాలి
ఇంకా మావోయిస్టు మార్గంలో ఉన్న మిగతా వారంతా ప్రభుత్వం ఎదుట లొంగిపోతే వారికి కావాల్సిన పునరావాస వసతులతో పాటు వారు ఆర్థికంగా జీవించేందుకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తామన్నారు.మావోయిస్టులో ఆగడాలు అంతానికి చేరుకున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఆగడాలు ప్రస్తుతం అంతానికి చేరుకునే దశకు వచ్చాయని బస్తర్ రేంజ్ ఐజి సుందర్ రాజ్ వెల్లడించారు. హింస మార్గాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంత వాతావరణంలో జీవితం గడపాలని మావోయిస్టులకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. అడవుల్లో మిగిలిపోయిన మావోయిస్టులు గౌరవంగా ఆయుధాలను వదులుకొని జనజీవన స్రవంతిలో కలిసి సురక్షితమైన జీవితాన్ని ఆస్వాదించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Maoists Surrender: అజ్ఞాతంలో ఉన్నవారు జన జీవనంలోకి రండి.. మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి సూచన

