TG Revenue Department: దశాబ్దాలుగా భూముల విషయంలో సాగుతున్న సరిహద్దు తగాదాలు, కొలతల్లో వ్యత్యాసాలు, రికార్డుల ట్యాంపరింగ్‌కు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అత్యాధునిక అస్త్రాన్ని సిద్ధం చేసింది. రోవర్స్ అనే ఆధునిక సాంకేతికతతో భూ కొలతల సమస్యలకు చెక్ పెట్టాలని భావిస్తున్నది. ఈ టెక్నాలజీ మిషన్లతో సెంటిమీటర్ల తేడాలను కూడా స్పష్టంగా కొలవచ్చనే ఉద్దేశ్యంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే 600 రోవర్లు కొనుగోలు చేసేందుకు రెవెన్యూ శాఖ ప్లాన్ చేసింది. వీటిని అన్ని జిల్లాలకు అందజేయనున్నారు. వీటి నిర్వహణ బాధ్యతలను ఇటీవల సర్కార్ నియమించిన 5500 సర్వేయర్లు మానిటరింగ్ చేయనున్నారు. ఈ విధనం సమర్థవంతంగా అమలైతే సర్వే వ్యవస్థలో విప్లవం వచ్చినట్లేనని రెవెన్యూ ఆఫీసర్లు చెప్తున్నారు. భూ భారతిలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయం పై వ్యవసాయ శాఖ ఆఫీసర్లు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
Also Read: TG Endowments Department: ఎండోమెంట్ శాఖలో అధికారుల కొరత.. 69 ఈవో పోస్టులు ఖాళీ
రోవర్ టెక్నాలజీ ఏమిటీ?
రోవర్ అనేది శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా పనిచేసే ఒక అధునాతన ఎలక్ట్రానిక్ పరికరం.గతంలో గొలుసులతో కొలిచినప్పుడు అడుగుల తేడా వచ్చే అవకాశం ఉండేది. కానీ రోవర్ ద్వారా కేవలం 2 నుంచి 5 సెంటీమీటర్ల వ్యత్యాసం కూడా లేకుండా కచ్చితమైన రీడింగ్ వస్తుంది. ఈ తర్వాత ఈ రోవర్ తో సేకరించిన రీడింగ్ ను నేరుగా సెంట్రల్ సర్వర్‌కు అనుసంధానించబడుతుంది. దీనివల్ల రికార్డులను ఎవరూ మార్చలేరు.ఈ విధానంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇప్పటికే స్టడీ చేసి సర్కార్ కు ఓ రిపోర్టును అందజేశారు. సీఎం మంత్రులు కూడా దీన్ని ఆమోదించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ రోవర్స్ విధానం అమల్లోకి రానున్నది.
ఒక్కో మండలం యూనిట్ గా
మండలం యూనిట్‌గా భూ విస్తీర్ణం ప్రాతిపదికన ఈ సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పని చేస్తారు. రోవర్స్ విధానంతో భూ కొలతలు చెక్ చేసి ఏళ్ల తరబడిన సమస్యలకు చెక్ పెట్టనున్నారు. ప్రతి అంగుళాన్ని కొలిచి, డిజిటలైజ్ చేయడం ద్వారా యజమానికి శాశ్వత యాజమాన్య భద్రత కలుగుతుంది. గ్రామాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సరిహద్దు తగాదాలు ఈ కచ్చితమైన కొలతలతో పరిష్కారమవుతాయి. అంతేగాక భూమి వివరాలు ఆన్‌లైన్‌లో కచ్చితంగా ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం అవుతుంది, మోసాలకు తావుండదు.అంతేగాక గతంలో సర్వే కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు రోవర్ల వాడకంతో తక్కువ సమయంలో ఎక్కువ భూమిని సర్వే చేయవచ్చని రెవెన్యూ ఆఫీసర్లు చెప్తున్నారు.
Also Read: TG Revenue Department: గ్రామ పాలనాధికారులుగా వీఆర్వోలు.. వీఆర్ఏలు.. పాతవారికి మల్లీ చాన్స్..

