Kaushik Reddy: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) అన్నారు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అసెంబ్లీలో విచారణ చేపట్టారు. ఈ విచారణకు పిటిషనర్ పాడి కౌశిక్ రెడ్డి హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడారు.
Also Read: Parliament Security Breach: గోడ దూకి పార్లమెంట్ భవనం ఆవరణలోకి ప్రవేశించిన వ్యక్తి
అనర్హత వేటు వేయాలి
తాను మున్సిపల్ ఎన్నికల హడావిడిలో ఉన్నప్పటికీ విచారణకు హాజరయ్యానని తెలిపారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని విచారణ సందర్భంగా తాను స్పీకర్‌ను కోరినట్లు తెలిపారు. దానంపై అనర్హత వేటు వేసి ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాలని విన్నవించానన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని ఆ రెండు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆరోపించారు.
Also Read: GHMC – Hydra: హైదరాబాద్ నగరంపై హైడ్రా ఫోకస్.. ఆ సమస్య రాకుండా చర్యలు..

