Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరుని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత సంవత్సరం సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌నే కాదు, టాలీవుడ్లో హీరోయిన్‌గానూ తన స్థానాన్ని పదిలం చేసుకుంది ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh). ఆ సినిమా టైమ్‌లో అనిల్ రావిపూడితో ఎఫైర్ అనేలా కూడా వార్తలు వచ్చాయి కానీ, ఆ వార్తలని అటు అనిల్ రావిపూడి, ఇటు ఐశ్వర్య రాజేష్ ఇద్దరూ ఖండించి, నవ్వుకున్నారు. హిట్ ఇచ్చిన దర్శకుడితో హీరోయిన్లు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అందులోనూ ఐశ్వర్య రాజేష్‌కు టాలీవుడ్ (Tollywood)లో సరైన హిట్ లేదు. అలాంటి హీరోయిన్ని ఏకంగా బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు చాలా స్పెషల్ అనే చెప్పాలి. అందుకే అతనంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఐశ్వర్య రాజేష్. దానిని అపార్థం చేసుకుని కొన్ని మీడియాలు ఇష్టం వచ్చినట్లుగా వార్తలు రాశాయి.
Also Read- Sudev Nair: విలన్‌గా బెస్ట్ ఛాయిస్‌గా మారిన మలయాళ నటుడు.. టాలీవుడ్‌లోనూ బిజీ!
అలాంటి డ్రస్‌లో చూడాలి
సరే ఇక విషయంలోకి వస్తే.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఐశ్వర్య రాజేష్ బిజీబిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఆమె ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఇందులో ఒకరు తన పట్ల ఎంత అసభ్యకరంగా ప్రవర్తించారో కూడా చెప్పుకొచ్చింది. పర్సన్ ఎవరనేది ఆమె చెప్పలేదు కానీ, తన పట్ల చాలా అసహ్యంగా ప్రవర్తించాడని మాత్రం ఆమె తెలిపింది. ‘నిన్ను రాత్రి పూట వేసుకునే డ్రస్‌లో చూడాలని ఉంది’ అని అన్నాడట. నన్నే అలా అన్నాడంటే.. నాకంటే ముందు ఎంతమంది పట్ల అతను అలా ప్రవర్తించి ఉంటాడో విజువల్‌గా నేను ఊహించుకున్నానంటూ షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చింది. ఆ ఘటనను ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు. దీంతో ఎవరా వ్యక్తి? అని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆమె ఇంతకు ముందు చేసిన సినిమాల లిస్ట్‌ని తిరగేస్తున్నారు. ఆ పర్సన్ ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.
Also Read- Prabhas: మారుతికి మరో ఛాన్స్.. అందుకే ప్రభాస్ మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్!
ఎవరి ఇష్టం వారిది..
ఇక ఈ డ్రస్సు నువ్వు వేసుకోవద్దు అంటే.. ఆ మాట వింటారా? లేక మీ ఇష్ట ప్రకారం చేస్తారా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. మాట వింటానని ఐశ్వర్య చెప్పారు. ‘డ్రస్ అనేది రెస్పాన్సిబుల్.. ఆ అకేషన్‌కు సరిపడా, వెళ్లే ప్లేస్‌కు తగినట్లుగా ఎలాంటి డ్రస్ వేసుకోవాలో.. అలాంటిది వేసుకుంటాను. ఎవరైనా వారి ఇష్ట ప్రకారం వేసుకుంటానంటే అది వారి విష్.. అంతే..’ అని అన్నారు. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ పార్ట్ 2 వస్తుందంట కదా.. అంటే ‘ఇంకా పార్ట్ 1 హ్యాంగోవర్లోనే అంతా ఉన్నారు’ అంటూ ఆ సినిమాలోని పాటకు శృతి కలిపారు. ఇంకా తన లైఫ్‌లో ఎదుర్కొన్న కష్టాలు, ఇష్టాలు ఇలా అన్నీ ఆమె ఈ పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.
https://www.instagram.com/nikhilvijayendrasimha/p/DUGRmoHiVSv/
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

