Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) అనగానే గుర్తొచ్చేది ఆయన గొప్ప మనసు. ఎదుటి వారి పట్ల ప్రేమ చూపడంలోనూ, కడుపు నింపడంలోనూ నిజంగానే ఆయన రాజు. ప్రభాస్‌తో పరిచయం ఉన్నవారంతా చెప్పే మాట ఇదే. ఆయనకు కష్టం వచ్చినా సరే భరిస్తాడు కానీ, ఎదుటివారికి కష్టం కలిగించే పని మాత్రం ప్రభాస్ చేయడని.. ఇండస్ట్రీలో ఆయన తెలిసిన వారంతా చెప్పే మాట. అది నిజమే అనిపిస్తుంది. ఎలా అంటారా? రీసెంట్గా ‘ది రాజా సాబ్’ (The Raja Saab) మూవీతో వచ్చిన ప్రభాస్‌కు, ఆ సినిమా చేదు అనుభవాన్నే మిగిల్చింది. తన జోనర్ మార్చి, ప్రభాస్ ట్రై చేసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. అందుకు కారణాలు ఏంటనేది పక్కన పెడితే.. ప్రభాస్ మాత్రం మరోసారి తన గొప్ప మనసు ఏంటో నిరూపించుకున్నారు. అదెలా అంటే..
Also Read- Bhagavanthudu: తిరువీర్ ‘భగవంతుడు’ టీజర్ వదిలారు.. పక్కా హిట్టంట!
మారుతికి మరో ఛాన్స్
‘ది రాజా సాబ్’ విషయంలో ప్రభాస్‌పై కాకుండా దర్శకుడు మారుతి (Director Maruthi)ని అంతా టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం, ఆయన ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పిన మాటలే. ఈ సినిమాలోని ప్రతి సీన్ ప్రేక్షకులని మెప్పిస్తుంది. అలా జరగకపోతే నా ఇంటికి వచ్చి అడగండి.. అంటూ ఇంటి అడ్రస్ కూడా చెప్పారు. సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ, ఎక్కువ శాతం ఫ్యాన్స్‌ని కూడా మెప్పించలేకపోయాయి. దీంతో ఫ్యాన్స్ అంతా మారుతిని ఆడుకోవడం స్టార్ట్ చేశారు. మరి ఇది తెలిసిందో.. లేదంటే తనపై మారుతికి తనపై ఉన్న ప్రేమ, అభిమానం కదిలించిందో తెలియదు కానీ, అతనికి ప్రభాస్ మరో ఛాన్స్ ఇచ్చినట్లుగా టాక్ వినబడుతోంది. అది కూడా అలాంటిలాంటి ఛాన్స్ కాదు. పాన్ ఇండియా సక్సెస్ఫుల్ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్లో ప్రభాస్ ఓ సినిమా కమిటై ఉన్న విషయం తెలిసిందే.
Also Read- Vijay Devarakonda: ‘ఆర్’ లెటర్ సినిమాలతో విజయ్ దేవరకొండ బాక్సాఫీస్‌పై డబుల్ అటాక్!
హోంబలే ఫిలింస్ బ్యానర్లో..
‘సలార్ 2’ కాకుండా మరో సినిమా హోంబలే బ్యానర్లో ప్రభాస్ చేయాల్సి ఉంది. ఆ సినిమా మారుతి దర్శకత్వంలో ఉంటుందట. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ కూడా ఇప్పించాడట ప్రభాస్. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఆల్రెడీ ‘ది రాజా సాబ్’ నిర్మాతైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌కు ‘స్పిరిట్’ తెలుగు రైట్స్ ఇప్పించడంతో పాటు, మరో సినిమా వాళ్ల బ్యానర్లో చేస్తానని ప్రభాస్ మాట ఇచ్చాడట. ఇప్పుడు మారుతి విషయంలో కూడా ప్రభాస్ అదే చేశారని అంటున్నారు. మారుతి కూడా ఈసారి డార్లింగ్ కోసం ఓ పవర్ ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారని, ఫుల్ స్ర్కిప్ట్ రెడీ అవ్వగానే.. ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేలా ప్రభాస్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ, మారుతికి మరో ఛాన్స్ ఇచ్చి ప్రభాస్ తన గొప్ప మనసు చాటుకున్నాడంటూ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

