Medaram Jatara: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Jishnu Dev Varma) ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర, దక్షిణాది కుంభమేళాగా పేరుగాంచిన మేడారం మహా జాతరలో గద్దెలపై కొలువైన సమ్మక్క సారలమ్మ దర్శించుకున్నారు. శుక్రవారం హైదరాబాదు(Hyderabad) నుంచి మేడారం చేరుకున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్‌లు ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీసుల చే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గౌరవ వందనం పొందారు.
గిరిజన సాంప్రదాయ పద్ధతిలో..
సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని గిరిజన సాంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత నిలివెత్తు బంగారం తల్లులకు సమర్పించారు. మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్ తల్లులకు మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అంతకుముందు గ్యారత్ వెన్ ఓవెన్ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ కు గద్దెల వద్ద జరిగిన నూతన కట్టడాలు, అభివృద్ధి, మేడారం సాంస్కృతి, గిరిజన సాంప్రదాయ విధానాలు, మేడారం గద్దెల వద్ద రాతి శిలలపై చెక్కిన శిల్పాల విశేషాల గురించి మంత్రి సీతక్క వివరించారు.
Also Read; Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్‌కు మరోమారు సిట్ నోటీసులు!
దాదాపు రూ 251 కోట్లు..
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల ఆరాధ్య దైవం, కొలిచిన వారికి కొంగుబంగారంగా నిలిచే వన దేవతల ఆలయ పునరుద్ధరణ శాశ్వత నిర్మాణ పనులు, అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ 251 కోట్లు వెచ్చించి ఆదివాసీల గౌరవాన్ని పెంచిందన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు ఇప్పటికే కోటిన్నర భక్తులు దర్శించుకున్నట్టు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో రెండు కోట్ల భక్తుల దర్శనాలు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మేడారం ఇంత పెద్ద జాతర జరగడానికి కృషిచేసిన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth reddy)కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Also Read: AP TG Water Dispute: గురుదక్షిణ కోసం.. తెలంగాణకు ద్రోహం చేస్తారా? సీఎంను నిలదీసిన హరీశ్ రావు

