Phone Tapping: కేసీఆర్‌కు మరోమారు సిట్ నోటీసులు!
SIT to Reissue Notice to KCR
Telangana News

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్‌కు మరోమారు సిట్ నోటీసులు!

Phone Tapping: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు చివరి అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. విచారణకు రావాలంటూ శుక్రవారం సిట్ నోటీసులు సైతం జారీ చేసింది. మున్నిపల్ ఎన్నికలు, పార్టీ అంతర్గత సమావేశాల దృష్ట్యా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన సిట్ విచారణకు తాను రాలేనని కేసీఆర్ సూచించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సమావేశమైన సిట్ అధికారులు.. కేసీఆర్ అభ్యర్థనపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయనకు మరోమారు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

సాయంత్రం నోటీసులు..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నోటీసుల వ్యవహారంపై సిట్ అధికారులు.. శుక్రవారం (జనవరి 30) కీలక భేటి నిర్వహించారు. కేసీఆర్ ను హైదరాబాద్ లోనే విచారించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో విచారణ జరిపే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. విచారణకు హాజరయ్యే తేదీని ఖరారు చేస్తు ఇవాళ సాయంత్రం మరోమారు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. విచారణకు సంబంధించిన డేట్, ప్లేసు నోటీసుల్లో పేర్కొననున్నట్లు సమాచారం. కేసీఆర్ స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్న అనంతరం పూర్తి వివరాలతో కోర్టులో చార్జి షీట్ ను సిట్ దాఖలు చేయనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు లో ఇప్పటివరకు జరిగిన విచారణతో పాటు సేకరించిన ఆధారాలని ఛార్జ్ షీట్ లో కోర్టుకు తెలపనుంది.

Also Read: Husband Suicide: షాకింగ్ ఘటన.. పెళ్లైన 2 నెలలకే భార్య జంప్.. తట్టుకోలేక భర్త ఏం చేశాడంటే?

కేసీఆర్ చేసిన విజ్ఞప్తి ఏంటంటే?

గురువారం మధ్యాహ్నం జారీ చేసిన సిట్ నోటీసులకు సాయంత్రం కేసీఆర్ (KCR On SIT Notice) బదులిచ్చారు. మునిసిపల్ ఎన్నికల దృష్ట్యా సిట్ ముందుకు రాలేనని విచారణాధికారులకు సమాచారం అందించారు. అభ్యర్థుల జాబితా ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నానని వివరించారు. విచారణ కోసం సిట్ అధికారులకు అనువుగా ఉన్న మరో తేదీని తెలియజేయాలని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ డివిజన్ ఏసీపీ వెంకటగిరికి కేసీఆర్ లేఖ రాశారు. అలాగే, తన నివాస స్థలమైన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి (గ్రామం) ఇంటి నంబర్ 3-96 వద్ద విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులను తాము కోరిన ప్రదేశానికి రావాలంటూ చట్ట ప్రకారం ఒత్తిడి చేయకూడదని సిట్ కు కేసీఆర్ సూచించారు.

Also Read: CM Revanth Reddy: హార్వర్డ్ విద్యార్ధులతో సీఎం ముఖాముఖి.. తెలంగాణ రైజింగ్ 2047 పై వివరణ!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?