Varun Dhawan: ‘బోర్డర్ 2’ సెట్స్‌లో వెన్నెముక విరగ్గొట్టుకున్న హీరో..
Varun-Dhawan
ఎంటర్‌టైన్‌మెంట్

Varun Dhawan: ‘బోర్డర్ 2’ సెట్స్‌లో వెన్నెముక విరగ్గొట్టుకున్న హీరో.. షాకింగ్ వీడియో వైరల్!

Varun Dhawan: సినిమా అంటే రంగుల ప్రపంచం మాత్రమే కాదు, దాని వెనుక నటుల రక్తం, చెమట కూడా ఉంటాయని వరుణ్ ధావన్ మరోసారి గుర్తు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలీవుడ్ వరుణ్ ధావన్ షేర్ చేసిన ఒక వీడియో నెటిజన్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. భారీ వార్ డ్రామా ‘బోర్డర్ 2’ షూటింగ్ సమయంలో జరిగిన ఒక భయంకరమైన ప్రమాదం గురించి వరుణ్ పంచుకున్న విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read also-Kanchana Re-Release: హరర్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మరింత క్లారిటీతో ‘కాంచన’ వచ్చేస్తుంది.. ఎప్పుడంటే?

అసలు ఏం జరిగిందంటే?

యాక్షన్ సీక్వెన్స్ అంటేనే రిస్క్. కానీ ‘బోర్డర్ 2’ సెట్స్‌లో అది ప్రాణాంతకమైన ప్రమాదంగా మారింది. ఒక కీలకమైన వార్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు, భారీ కెమెరా క్రేన్ వరుణ్ ధావన్ వైపు వేగంగా దూసుకొచ్చింది. ఆ క్రేన్ తగిలితే ప్రాణాలకే ముప్పు అని గ్రహించిన వరుణ్, అప్పటికప్పుడు దాని నుండి తప్పించుకోవడానికి గాలిలోకి దూకారు. అయితే, దురదృష్టవశాత్తు ఆయన నేరుగా వెళ్లి ఒక పదునైన రాతిపై పడ్డారు. ఆ దెబ్బ నేరుగా వెన్నెముక చివరి భాగానికి తగిలింది. వరుణ్ మాటల్లో చెప్పాలంటే.. “నా జీవితంలో చూసిన వరస్ట్ పెయిన్ అది.” ఆ దెబ్బకు వెన్నెముకకు హైర్‌లైన్ ఫ్రాక్చర్ అయ్యింది. అంటే ఎముక పూర్తిగా విరగకపోయినా, పగులు ఇచ్చి నరకయాతనను మిగిల్చింది.

అయినా.. తగ్గేదే లే!

ఒక సామాన్య వ్యక్తికి ఆ గాయం తగిలితే కనీసం నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటారు. కానీ వరుణ్ ధావన్ ‘మాస్’ అనిపించుకున్నారు. ఆ నొప్పి వల్ల ఆయన కనీసం నిలబడలేకపోయారు, అడుగు తీసి అడుగు వేయడానికి ప్రాణం పోయేంత పని అయ్యింది. కానీ షూటింగ్ ఆగిపోతే నిర్మాతలకు కలిగే నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, తన టీమ్ మెంబర్స్ భుజాల మీద చేతులు వేసి నడుస్తూనే ఆ రోజు షూటింగ్ పూర్తి చేశారు. వరుణ్ చూపిన ఈ తెగువ చూసి సన్నీ డియోల్ లాంటి సీనియర్లు కూడా ఫిదా అయిపోయారు. వరుణ్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. “మేము పడే కష్టం తెరపై కనిపిస్తుంది, కానీ దాని వెనుక ఉన్న ఈ గాయాలే మాకు మెమరీస్” అంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read also-Harsh Vardhan: ఆ ఈవెంట్లో అవమానం తట్టుకోలేక నటుడు హర్ష వర్థన్ ఏం చేశారంటే?

‘బోర్డర్ 2’ అంటేనే ఒక ఎమోషన్. 1971 యుద్ధ వీరుల గాథను వెండితెరపై ఆవిష్కరించేందుకు వరుణ్ ధావన్ తన రక్తాన్ని ధారపోస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత వరుణ్ పడ్డ ఈ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంత రిస్క్ చేసి తీస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?