Cm Chandrababu | ఒంగోలు గిత్త సత్తా చూపించింది. ఏకంగా రూ.41 కోట్లకు అమ్ముడు పోవడం చాలా సంతోషం అని సీఎం చంద్రబాబు అన్నారు. ఒంగోలు గిత్తలతో ఏపీ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా తెలిసిందన్నారు. ఏపీ పశుసంవర్థక వారసత్వం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తోందని.. విదేశీయులు మన గిత్తలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారంటూ చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ఏపీ పశువులు కూడా మనకు గొప్ప సంపద అని.. వాటిని విస్తృతంగా పెంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.
రీసెంట్ గా బ్రెజిల్ లో నిర్వహించిన వేలంలో ఒంగోలు గిత్త రూ.41 కోట్లు పలికింది. ఏడు అడుగుల ఎత్తు, బలిష్టమైన శరీరం, ఆకట్టుకునే రూపం, నడకలో రాజసం ఇవన్నీ ఒంగోలు గిత్త సొంతం. ప్రకాశం జిల్లా ఇలాంటి గిత్తలకు చాలా ఫేమస్. ప్రస్తుతం ఒంగోలు గిత్త జాతిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.