Vishwambhara: ఎప్పుడో పోయిన సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘విశ్వంభర’ (Vishwambhara) చిత్రం ఇంత వరకు విడుదలకు నోచుకోలేదు. గ్రాఫిక్స్ వర్క్ నిమిత్తం వాయిదా పడిందని, ఆ సినిమా రావాల్సిన స్లాట్‌తో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీని దింపుతున్నామని చెప్పారు. మళ్లీ సంక్రాంతి వచ్చింది. అయినా కూడా ఎప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందో క్లారిటీ లేదు. పండగలకి కూడా ఏదైనా అప్డేటో, పోస్టరో వదలడం లేదు. అసలు ఈ సినిమా లైన్‌లో ఉందా? లేదా? అనేలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అంగీకరించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasada Garu) షూటింగ్ ముగించుకుని, థియేటర్లలో విడుదలైన బ్రహ్మాండమైన సక్సెస్ అందుకుంది. అయినా కూడా ‘విశ్వంభర’లో కదలిక లేదు. అదేమంటే బిజినెస్ జరగలేదనేలా టాక్ నడిచింది. అంతకు ముందు చిరంజీవి నుంచి వచ్చిన ‘భోళా శంకర్’ ఎఫెక్ట్ ‘విశ్వంభర’ఫై పడిందని, అందుకే ఆ సినిమా బిజినెస్ కాలేదనేలా టాక్ నడిచింది.
Also Read- Bhartha Mahasayulaku Wignyapthi: ‘అద్దం ముందు’ వీడియో సాంగ్.. అబ్బ, ఎంత అందంగా ఉంది!
‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఇదే..
కానీ, చిరంజీవి వెర్షన్ వేరేలా ఉంది. ఈ సినిమా కచ్చితంగా విడుదలవుతుందని మెగాస్టార్ మీడియాకు చెప్పారు. తాజాగా మీడియా వారిని చిరంజీవి ఇంటికి పిలిపించుకుని ఆత్మీయంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ మాటల్లో ‘విశ్వంభర’ ఎప్పుడు విడుదల? అనే టాపిక్ కూడా వచ్చిందట. అందుకు చిరంజీవి.. ‘విశ్వంభర’ ఫైనల్ వర్క్‌లో ఉందని, ఇంకా తను సీజీ చూడలేదని, ఒక్కసారి చూసిన తర్వాత ప్రమోషన్స్ మొదలవుతాయని చెప్పారట. అంతేకాదు, జూలై 9న ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని కూడా చిరు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో ‘విశ్వంభర’ సినిమా ఆగిపోలేదనే విషయంలో అయితే క్లారిటీ వచ్చేసింది. ఇక చిరంజీవి ఈ సినిమాను చూసి, ఓకే అంటే ప్రమోషన్స్ కూడా మొదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు చిరంజీవి బాబీతో చేయాల్సిన సినిమాకు సంబంధించి అప్పుడే చర్చలు కూడా మొదలయ్యాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందట. ఈ సినిమా బాబీ స్టైల్‌లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని చిరు చెప్పారని తెలుస్తోంది.
Also Read- Sumathi Sathakam Trailer: పిఠాపురం ఎమ్మెల్యేగారు చెప్పింది నిజమే.. ఏం చెప్పారు?
రికార్డుల శంకర వర ప్రసాద్..
ఇక సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం ప్రేక్షకులను మెప్పించి సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. 3వ వారంలో కూడా ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. 360 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి, ఈ సంవత్సరపు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇంకా ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లోనూ భారీగా లాభాలు రావడంతో, డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ అంతా హ్యాపీగా ఉన్నారు. ఇదే జోష్ ‘విశ్వంభర’కు కూడా ఉంటుందని చిరు భరోసా ఇస్తే మాత్రం.. మరో మెగా హిట్ రెడీ అని ఫిక్సయిపోవచ్చు. చూద్దాం.. మరి ఏం జరుగుతుందో?
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

