Kalvakuntla Kavitha: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో దూకుడు పెంచిన సిట్ అధికారులు.. తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)కు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సిట్ (SIT) నోటీసులపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) జరగడం బాధాకరమన్న ఆమె.. దాని వెనకున్న వ్యక్తులు పర్యవసానాలు ఎదుర్కొంటారా? లేదా? చూడాలని కవిత పేర్కొన్నారు.
‘కేసుకు ముగింపు పలకాలి’
కొద్ది రోజుల్లో పురపాలక ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే కేసీఆర్ కు నోటీసులు పంపారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై కవిత ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణను పూర్తి చేసి.. ఈ కేసుకు ముగింపు పలకాలని ప్రభుత్వానికి సూచించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది కచ్చితంగా బాధాకరమని ఈ సందర్భంగా కవిత పేర్కొన్నారు.
‘ఇంటి అల్లుడి ఫోనే ట్యాప్ చేశారు’
కాగా, గతేడాది డిసెంబర్ లో ఫోన్ ట్యాపింగ్ అంశంపై కవిత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో చాలా తప్పిదాలు జరిగాయని ఆమె అంగీకరించారు. ఇంటి అల్లుడని చూడకుండా తన భర్త ఫోన్ ట్యాప్ చేయించారని మండిపడ్డారు. దొంగచాటుగా తన భర్త ఫోన్ వినడం పద్దతేనా? అని ప్రశ్నించారు. తనతో పాటు తన భర్తపై కూడా బీఆర్ఎస్ పార్టీ విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. "రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం కావాలనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి డైవర్షన్… pic.twitter.com/X5FHkLCjV7
— ChotaNews App (@ChotaNewsApp) January 29, 2026
Also Read: Janasena MLA Controversy: జనసేన ఎమ్మెల్యే vs వైసీపీ.. రాసలీలలు కేసులో ట్విస్ట్.. బాధితురాలు కీలక ప్రకటన
కేసీఆర్ అత్యవసర భేటి!
సిట్ నోటీసుల నేపథ్యంలో మరికాసేపట్లో కేసీఆర్ తో కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao) భేటి కాబోతున్నట్లు తెలుస్తోంది. నంది నగర్ లో సిట్ నోటీసులు అందుకున్న అనంతరం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అక్కడ వ్యవసాయ పంటలను ఆయన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మామిడి తోటలోకి కారులో వెళ్లి అక్కడి కూలీలతో కేసీఆర్ మాట్లాడినట్లు బీఆర్ఎస్ (BRS) వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్, హరీశ్ రావు సైతం నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ తో భేటి కానున్నట్లు సమాచారం.

