Janasena MLA Controversy: ఎమ్మెల్యే రాసలీలలు కేసులో బిగ్ ట్విస్ట్
Janasena MLA Sridhar Harassment
ఆంధ్రప్రదేశ్

Janasena MLA Controversy: జనసేన ఎమ్మెల్యే vs వైసీపీ.. రాసలీలలు కేసులో ట్విస్ట్.. బాధితురాలు కీలక ప్రకటన

Janasena MLA Controversy: తిరుపతి జిల్లా నారా కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చిన లైంగిక ఆరోపణల అంశం పొలిటికల్ టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. బాధిత మహిళను ప్రలోభపెట్టి కూటమి ప్రభుత్వంపై వైసీపీ (YSRCP) అసత్య ప్రచారానికి తెర లేపిందంటూ జనసేన (Janasena)తో పాటు టీడీపీ (TDP) శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ విమర్శలను ఖండిస్తూ బాధిత మహిళ మరో వీడియోను విడుదల చేశారు. తనను వైసీపీ వాళ్లు మాయ చేసి పెట్టి హానీట్రాప్‌ చేయించారన్న ఆరోపణలను కొట్టిపారేశారు.

‘వైసీపీతో ముడిపెట్టొద్దు’

తనకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే బయటపెట్టినట్లు బాధిత మహిళ తాజా వీడియోలో పేర్కొన్నారు. తనను ఎవరూ ప్రలోభపెట్టలేదని.. వైసీపీకి ఈ అంశంతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. తనకు వైసీపీకి ముడిపెడుతున్న వారంతా.. ఎమ్మెల్యే శ్రీధర్ గతంలో ఆ పార్టీ తరపున సర్పంచ్ గా గెలిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలని బాధితురాలు సూచించారు. తనకు జరిగిన అన్యాయానికి.. పార్టీలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.

తాతంశెట్టి నాగేందర్‌కు సూటి ప్రశ్నలు

తనకు అన్యాయం చేసిన వ్యక్తి జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాబట్టే పదే పదే ఆ పార్టీ పేరు ప్రస్తావనకు తీసుకురావాల్సి వస్తోందని బాధితురాలు అన్నారు. మరోవైపు జనసేన నేత తాతంశెట్టి నాగేందర్ తనపై చేసిన ఆరోపణలకు సైతం ఆమె కౌంటర్ ఇచ్చారు. ‘2012 నుంచి నా బయోడేటా చూపించి తాతంశెట్టి నాగేందర్‌ నాపై ఆరోపణలు చేస్తున్నారు.ఎవరెవరో అబ్బాయిల పేర్లు చేప్పి మాట్లాడుతున్నారు. వాళ్లు ప్రైండ్సా.. బాయ్ ప్రైండ్సా.. ఎఫైర్సా నాగేందర్ క్లారిటీ ఇవ్వాలి.పేర్లు చేబితే.. ఊరుకోను.. అధారాలను చూపించాలి’అంటూ బాధిత మహిళ డిమాండ్ చేశారు.

రూ.25 కోట్లు డిమాండ్‌పై క్లారిటీ

రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదని బాధితురాలు తాజా వీడియోలో క్లారిటి ఇచ్చారు. ఆ వాయిస్ తనది కాదని స్పష్టం చేశారు. తానెవరితో మాట్లాడి రూ.25 కోట్లు అడిగానో ఫుల్ ఆడియో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తనను ధైర్యంగా ప్రశ్నిస్తున్న వారు.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను కూడా అదే విధంగా నిలదీయాలని డిమాండ్ చేశారు.

Also Read: KCR SIT Notice: గులాబీ నేతకు సిట్ నోటీసులు.. కాసేపట్లో కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్ అత్యవసర భేటి!

రంగంలోకి పోలీసులు..

మరోవైపు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ ఫిర్యాదుపై రైల్వే కోడూరు అర్బన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగిని హర్ష వీణ తన కొడుకును బ్లాక్ మెయిల్ చేస్తోందని ఈనెల 7న ప్రమీలమ్మ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి హర్ష వీణ కాల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నట్లు రైల్వే కోడూరు సీఐ చంద్రశేఖర్ గురువారం తెలిపారు. ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తున్న హర్ష వీణ ఇంకా పోలీసుల ముందుకు రాలేదని తెలిపారు. ఆమె స్థానికంగా లేనట్లు తెలుస్తోందని చెప్పారు. ఈ కేసులో ఎమ్మెల్యే స్టేట్మెంట్ కూడా రికార్డు చేస్తామన్నారు. హర్ష వీణ నేరుగా విచారణకు హాజరైనా.. లేకపోతే తమను రమ్మని పిలిచినా వెళ్లి విచారిస్తామని కోడూరు అర్బన్ సీఐ స్పష్టం చేశారు. మరోవైపు స్థానిక విలేకరి శంకర్ రాజుపై నిర్భందించి దాడి చేసిన ఘటనపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ తెలిపారు.

Also Read: Delhi Murder: దిల్లీలో ఘోరం.. పోలీసు భార్యను.. డంబెల్‌తో కొట్టి చంపిన భర్త!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?