Chiranjeevi Song: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం నుండి ఆయన స్వయంగా పాడిన “పెద్దిరెడ్డి” ఫుల్ వీడియో సాంగ్ విడుదలై సోషల్ మీడియాను ఊపేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ పాటలో చిరంజీవి తన విలక్షణమైన శైలిలో డైలాగ్స్ చెబుతూ, “ఆగండయ్యా.. ఇక్కడి నుంచి నేను పాడతాను” అంటూ మైక్ అందుకునే సీన్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన హుషారైన మాస్ ట్యూన్‌కు చిరంజీవి గాత్రం తోడవ్వడం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
Read also-Kalki 2: ‘కల్కీ 2’లో దీపికను రిప్లేస్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?.. షూటింగ్ ఎప్పుడంటే?
ఈ పాటలో చిరంజీవి ఎనర్జీ లెవల్స్ అమోఘంగా ఉన్నాయి. బ్లాక్ సూట్ కూలింగ్ గ్లాసెస్ ధరించి ఆయన చేసిన స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్ మెగాస్టార్ మ్యాజిక్‌ను మరోసారి గుర్తుచేస్తున్నాయి. “ఆ పెద్దిరెడ్డి ఇది మొదలు పెద్ద వదినగారు.. ఆ చిన్నబాబు ఈది చివర చిన్న వదినగారు” అంటూ సాగే సాహిత్యం వినడానికి చాలా సరదాగా, క్యాచీగా ఉంది. పాట మధ్యలో ఆయన పలికించే హావభావాలు మరియు “పొగరెక్కిన పోటుగాడు కంచె దాటినాడే” వంటి లైన్లలోని గాంభీర్యం మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
Read also-Shruti Haasan: దమ్ము కొడుతూ.. దుల్కర్ సినిమాలో మరో తార లుక్ అదిరింది
విజువల్ గా కూడా ఈ పాట చాలా రిచ్ గా ఉంది, ఇందులో చిరంజీవితో పాటు నయనతార కూడా కనిపిస్తారు. మెగాస్టార్ వాయిస్‌లోని బేస్ భీమ్స్ అందించిన అదిరిపోయే డ్రమ్స్ బీట్స్ థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. మొత్తానికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంలోని ఈ “పెద్దిరెడ్డి” సాంగ్ చిరంజీవి కెరీర్లో మరో గుర్తుండిపోయే మాస్ సాంగ్‌గా నిలిచిపోనుంది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. రీజనల్ గా దాదపు నాలుగు వందల కోట్లు వసూలు చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. రానున్న రోజేల్లో మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

