Danam Nagender: దానం నాగేందర్ కు స్పీకర్ నోటీసులు‌
Danam Nagender ( image credit: swetcha reporter)
Political News

Danam Nagender: దానం నాగేందర్ కు స్పీకర్ నోటీసులు‌.. 30న విచారణకు హాజరుకావాలి!

Danam Nagender: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) అనర్హత పిటిషన్ పై ఈ నెల 30న విచారణ జరగనుంది. విచారణకు హాజరుకావాలని నాగేందర్ కు  స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, న్యాయవాదులకు నోటీసులు ఇచ్చారు. బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైనా అదే రోజు విచారణ జరగనుంది. పిటిషనర్ల తరపున సాక్ష్యాలు స్పీకర్ నమోదు చేయనున్నారు. అయితే స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికే బీఆర్ఎస్ లో ఉన్నానని పార్టీ మారలేదని స్పీకర్ కు లేఖ ఇచ్చారు.

అనర్హత పిటిషన్ కొట్టేయాలి

పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేయాలని స్పీకర్‌కు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ విజ్ఞప్తి చేశారు. నేను బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయలేదన్నారు. బీఆర్‌ఎస్‌ నన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు నాకు సమాచారం లేదన్నారు. నేను 2024 మార్చిలో కాంగ్రెస్‌ సమావేశానికి వెళ్లానని, ఆ సమయానికి వ్యక్తిగత హోదాలో వెళ్లానన్నారు. మీడియా కథనాల ఆధారంగా నేను పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తోందన్నారు. ఆపార్టీ అనర్హత పటిషన్ లోని అంశాలపై మాత్రమే వివరణ ఇస్తున్నానని, గతంలో కోర్టు తీర్పులను అనుసరించి ఆ అనర్హత పటిషన్ చెల్లుబాటు కాదన్నారు. అనర్హత పిటిషన్ తర్వాత పరిణామాలను అనుబంధ సమాచారంగా అంగీకరించొద్దని స్పీకర్ ను కోరారు.

Also Read: MLA Danam Nagender: దానం వ్యాఖ్యల వెనక మతలబు ఏమిటీ?.. వెనక్కి వెళ్తారా?.. కాంగ్రెస్ లోనే కొనసాగుతారా?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?