Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్, ఎంటర్‌టైన్మెంట్

Pawan Kalyan | స్వామిమలై ఆలయాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్​..!

Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​ ఆలయాల సందర్శన కొనసాగుతోంది. బుధవారం ఆయన సనాతన ధర్మ పరిరక్షణ యాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా ముందుగా కేరళకు వెళ్లిన ఆయన.. అక్కడ పలు ఆలయాలను సందర్శించారు. ఆ తర్వాత గురువారం తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని స్వామిమలై ఆలయాన్ని సందర్శించారు. ఇక్కడ కుమారస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట కొడుకు అకీరా నందన్ కూడా ఉన్నారు.

తమిళనాడులోని ఇంకా కొన్ని ప్రముఖ ఆలయాలను ఆయన సందర్శిస్తారని తెలుస్తోంది. ఇక తమిళనాడు రాజకీయాలపై కూడా ఏమైనా కామెంట్ చేస్తారేమో అని అంతా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పవన్ (Pawan Kalyan) అయితే ఎలాంటి కామెంట్లు చేయట్లేదు. కానీ హిందూ ఆలయాల పరిరక్షణపై మాట్లాడుతూ వస్తున్నారు. తమిళనాడులోని బీజేపీ ముఖ్య నేతలను కలుస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!