Municipal Elections: రసవత్తరంగా మారుతున్న మున్సిపల్ ఎన్నికలు
Municipal Elections (imagecredit:twitter)
Telangana News, హైదరాబాద్

Municipal Elections: ఎత్తుకు పై ఎత్తులు.. రసవత్తరంగా మారుతున్న మున్సిపల్ ఎన్నికలు

Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడంతో రాజకీయ వేడి ప్రారంభమైంది. అన్ని పార్టీలు గెలుపుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ సారి జాగృతి, జనసేన, టీడీపీలు సైతం పోటీకి సైతం అంటున్నాయి. అయితే రాష్ట్రంలోని ప్రధానపార్టీల గెలుపోటములపై ఈ పార్టీల ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ఎలా ముందుకు వెళ్తాయనేది ఇప్పుడు చర్చకుదారితీసింది. రాబోయే ఎన్నికలకు ఈ మున్సిపల్ ఎన్నికలు సైతం గీటురాయిగా మారనున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఈ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. దీంతో ఈసారి ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది. పోటాపోటీ ప్రచారం జరుగనుంది.

 గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో..

రాష్ట్ర ఎన్నికల. సంఘం 116మున్సిపల్, 7 కార్పొరేషన్లకు నోటీఫికేషన్ విడుదల చేసింది. దీంతో అన్ని పార్టీలు పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని ప్రధానపార్టీలైన కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) అన్ని మున్సిపల్, కార్పొరేషన్లలో పోటీకి సన్నద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రెండేళ్లలో చేసిన ప్రగతిని ప్రజలకు వివరించడంతో పాటు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన తప్పిదాలను ప్రజలకు వివరించి విజయం సాధించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే మంత్రులకు బాధ్యతలను అప్పగించింది. సమావేశాలను నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. గెలుపేలక్ష్యంగా పావులు కదువుతున్నారు. మెజార్టీ స్థానాలపై దృష్టిసారించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ సైతం అన్ని మున్సిపాలిటీలకు ఇన్ చార్జులను నియమించింది. ఆయా మున్సిపాలిటీల్లో నేతల సమన్వయం, ఆక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి అందజేయాలని సూచించింది.

విజయం సాధించేందుకు ప్లాన్..

అంతేకాదు పార్టీ నేతల మధ్యం విభేదాలు ఉంటే పరిష్కరించడం, అభ్యర్థుల ఎంపిక, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కరపత్రాలు, బస్తీ బాట కార్యక్రమం చేపట్టనున్నారు. వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషిచేస్తామని గులాబీకి బాటసగా నిలువాలని విజ్ఞప్తులు చేయనున్నారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో అన్ని మున్సిపల్, కార్పొరేషన్లను కైవసం చేసుకున్న విధంగానే ఇప్పుడు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని ఇప్పటికే పార్టీ ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ సైతం గతం కంటే ఈసారి ఎక్కువ స్థానాల్లో విజయం సాధించేందుకు ప్లాన్ రూపొందిస్తుంది. నేతలతో భేటీ సైతం నిర్వహించి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. కేంద్రం రాష్ట్రానికి కేటాయిస్తున్న నిధులు..చేసిన అభివృద్ధి.. రాష్ట్రంలోని కాంగ్రెప్రభుత్వ వైఫల్యాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని నేతలకు సూచించింది. పార్టీ ఇన్ చార్జులను సైతం నియమించనున్నట్లు సమాచారం. ఈసారి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై దృష్టిసారించనున్నట్లు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలిసింది.

Also Read: Guvvala Balaraju: నేను చచ్చే వరకు బీజేపీలోనే ఉంటా: గువ్వల బాలరాజు

మున్సిపాలిటీలపై దృష్టి..

అయితే ఎంఐఎం సైతం నల్లగొండ(Nalgonda), ఆదిలాబాద్(dhilabad), ఖమ్మం(Khammam), వరంగల్(Warangal) ఇలా పలు మున్సిపాలిటీల్లో పోటీచేసేందుకు కసరత్తు ప్రారంభించింది. గత ఎన్నికలకంటే ఈసారి ఎక్కువ స్థానాలపై దృష్టిసారించింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) పైనే ప్రత్యేక ఫోకస్ పెట్టిన ఎంఐఎం ఈసారి ప్రధాన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై దృష్టిసారించినట్లు సమాచారం. గ్రేటర్ ఎన్నికలు లేకపోవడంతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేపట్టబోతున్నట్లు ఆపార్టీ నేతలు తెలిపారు.

బీఆర్ఎస్ పై ఎక్కువ ప్రభావం

ఇదెలా ఉంటే ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పొత్తుతో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. సింహం గుర్తుతో వెళ్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆమె ప్రధానంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు, మహిళల ఓటు బ్యాంకును చీల్చే అవకాశం ఉండటంతో బీఆర్ఎస్ పై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బ్యాంకు ను క్యాష్ చేసుకుంటుందని, దీంతో మున్సిపాలిటీల్లో ఎక్కువ సీట్లలో విజయం సాధిస్తామని జాగృతి నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఒంటరిగానే పోటీచేస్తాయా?

జనసేన సైతం పోటీ చేస్తుందని ఆపార్టీ ప్రకటించింది. ఇప్పటికే పోటీ చేసే నేతల వివరాల సేకరణపై దృష్టిసారించింది. రంగారెడ్డి(Rangareddy), నల్లగొండ, నాగర్ కర్నూల్, ఖమ్మం జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో పోటీకి అభ్యర్థులను నిలుపుబోతున్నట్లు సమాచారం. దీనికి తోడు టీడీపీ సైతం పోటీకి సర్వేలు నిర్వహిస్తుంది. పోటీపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు సీపీఎం, సీపీఐ సైతం పోటీచేసేందుకు కసరత్తు ప్రారంభించాయి. అయితే అధికార కాంగ్రెస్ పార్టీతో కలిసి పోతాయా? లేకుంటే వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయా? ..అలా కాకుంటే కాంగ్రెస్ తో సీపీఐ కలిస్తే.. సీపీఎం ఏపార్టీతో పొత్తుతో వెళ్తుంది.. లేకుంటే ఒంటరిగానే పోటీచేస్తాయా? అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. అయితే రాష్ట్రంలో గత ఎన్నికలకంటే ఈసారి ఎక్కువ పార్టీలు పోటీ చేస్తుండటంతో ఏ పార్టీకి మేలు జరుగుతుంది? ఏ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తాయి అనేది ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఎన్నికల ప్రచారం సైతం హోరెత్తనుంది. అన్ని పార్టీలకు ఈ మున్సిపల్ ఎన్నికలు రాజకీయ భవిష్యత్ ను నిర్ణయించబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Ajit Pawar Death: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దుర్మరణం.. శోక సంద్రంలో రాజకీయ ప్రముఖులు!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?