Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నగారమోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ను మంగళ వారం ప్రకటించింది. దీంతో మున్సిపల్ ఎన్నికల రాజకీయం ఊపందుకుంది. మెదక్ ఉమ్మడి జిల్లాలో 20 మున్సిపాలిటీలకు గాను సిద్దిపేట మున్సిపల్ మినహా 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇటీవలనే 19 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ప్రకటించారు. బుధవారం నేటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 30 వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు అభ్యర్థులనుంచి నామినేషన్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారు. 31 న నామినేషన్ల స్క్రూటీనీ నిర్వహిస్టారు. నామినేషన్లు సక్రమంగా ఉన్న జాబితాను మున్సిపల్లో ప్రదర్శిస్తారు. ఒకవేళ వివిధ కారణాలతో నామినేషన్ల ను రిజెక్ట్ చేస్తే జిల్లా ఎన్నికల అధికారికి ఫిబ్రవరి 1 వ తేదీన అప్పీల్ చేసుకొనే అవకాశం కల్పించారు. అప్పీల్ చేసుకున్న అభ్యర్థుల జాబితాను మున్సిపల్ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. ఫిబ్రవరి 3 వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసహరణకు గడువు విధించారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 3 తరువాత పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను అన్నిల అధికారులు ఆయా మున్సిపల్లో ప్రకటించి ప్రదర్శిస్తారు.
11 న పోలింగ్..
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. ఫిబ్రవరి 11 వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాల్టీలకు ఎన్నికలు
మెదక్ (బీసీ మహిళ),రామాయంపేట(అన్ రిజర్వుడు మహిళా) నర్సాపూర్, (జనరల్ మహిళ) తూప్రాన్, (జనరల్ మహిళా)
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట (బీ సి మహిళ) మినహా.. గజ్వేల్ (బి సి మహిళల) దుబ్బాక (బీ సి మహిళ) హుస్నాబాద్ (ఎస్సీ జనరల్) చేర్యాల (ఎస్సీ మహిళ)
సంగారెడ్డి జిల్లాలో
సంగారెడ్డి మున్సిపాలిటీ (జనరల్ మహిళా) సదాశివపేట,( జనరల్ మహిళా) జహీరాబాద్(బిసి జనరల్) కొహీర్(ఎస్సీ జనరల్) నారాయణఖేడ్ (అన్ రిజర్వుడు) ఇస్నాపూర్ (జనరల్ మహిళా) ఆందోళ్ జోగిపేట (ఆన్ రిజర్వుడు) ఇంద్రేశం (ఎస్సీ మహిళ)జిన్నారం (బి సి జనరల్) గుమ్మడిదల (బిసి జనరల్) గడ్డిపోతారం మున్సిపాలిటీని ఎస్సీ మహిళ కు రిజర్వు చేశారు. మొత్తంగా మెదక్ ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2 పార్లమెంట్ పరిధిలోనీ 12 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 20 మున్సిపాల్టీలకు గాను సిద్దిపేట మున్సిపల్ ఎన్నిక మినహా (మే 5 వరకు పాలక వర్గం) కొనసాగనుంది. మిగతా 19 మున్సిపాల్టీలోనీ వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 4 పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో,12 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 20 మున్సిపాల్టీల ఉన్నాయి. హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలో కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, నల్లగొండ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ పరిధి ఉంది. మిగతా మున్సిపాలిటీలు మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి.
గెలుపు గుర్రాల కోసం అభ్యర్థుల జాబితా
అధికార కాంగ్రెస్ పార్టీ కి ముగ్గురు మంత్రులు దామోదర్ రాజనర్సింహ,పొన్నం ప్రభాకర్,జిల్లా ఇంచార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి లు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఆయా నియోజక వర్గ ఇంచార్జి,పార్టీ ఎమ్మెల్యే లు ఉన్న చోట వారి తో సమన్వయం చేసుకొని మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం అభ్యర్థుల జాబితాను కసరత్తు చేస్తున్నారు.ఇదిలా ఉండగా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్,మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలో బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పటికే హరీష్ రావు, మెదక్, నర్సాపూర్, గజ్వేల్ జహీరాబాద్, సంగారెడ్డి, ఆందోళ్ జోగిపేట, సదాశివపేట, తదితర మున్సిపాల్టీల్లో పర్యటించారు. సభలు నిర్వహించారు. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సహితం దుబ్బాక,రామాయంపేట,మెదక్, గజ్వేల్ పరిధిలో పర్యటించారు.బీజేపీ అభ్యర్థుల ఎంపిక కోసం త్రీమేన్ కమిటీ నీ ఏర్పాటు చేసి పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక కు కసరత్తు చేస్తున్నారు.ఈ మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ, బిఆర్ ఎస్ పార్టీ లు మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు.పోటాపోటీ సభలు నిర్వహిస్తూ పలుకు బడి కలిగిన నేతలను పార్టీల్లో చేర్చు కొంటున్నారు. ఏది ఏమైనా మెదక్ ఉమ్మడి జిల్లా లో మున్సిపల్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది.
Also Read: Kishan Reddy on Messi: వాడెవడో మెస్సీ వస్తే.. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్

