Chiranjeevi Movie: మెగాస్టార్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. రీజనల్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి అంటేనే రికార్డుల వేట ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీతో బాక్సాఫీస్ వద్ద ఆయన సృష్టించిన సునామీ మామూలుగా లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 15 రోజుల్లో ఈ సినిమా దాదాపు రూ. 358 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసింది, మెగాస్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు నిర్మాతలు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ఆల్ టైం రీజనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పక్కా తెలుగు కమర్షియల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీ, కేవలం రీజనల్ కంటెంట్‌తోనే ఈ స్థాయి వసూళ్లు సాధించింది.
Read also-Devara 2 Update: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. ‘దేవర 2’పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
‘ఘరానా మొగుడు’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ రోజుల్లో మనం చూసిన చిరంజీవి గారి కామెడీ టైమింగ్, ఈజ్, అండ్ మాస్ డైలాగ్స్‌ను అనిల్ రావిపూడి మళ్ళీ వెండితెరపై ఆవిష్కరించారు. నయనతార నటన, కాథరిన్ ట్రెసా హ్యుమర్, గెస్ట్ రోల్లో వెంకటేష్ మెరుపులు సినిమాకు పెద్ద అసెట్‌గా మారాయి. భీమ్స్ సిసిరోలియో అందించిన మాస్ సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో పూనకాలు తెప్పించాయి. 2026 సంక్రాంతి రేసులో పోటీగా ఉన్న ఇతర పెద్ద చిత్రాలను కాదని, ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో మెగాస్టార్ మ్యాజిక్ మరోసారి పనిచేసింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, భారీ లాభాలను తెచ్చిపెట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
Casting Couch: మెగాస్టార్ చిరంజీవికి కౌంటర్ ఇచ్చిన సింగర్ చిన్మయి శ్రీపద.. ఎందుకంటే?
When the BOSS arrives, records surrender 😎 😎
Megastar @KChiruTweets continues his record-breaking spree, setting yet another HISTORIC BENCHMARK in Telugu cinema ❤️🔥
₹358 Crore+ Worldwide Gross in 15 days for #ManaShankaraVaraPrasadGaru 💥
ALL-TIME REGIONAL INDUSTRY… pic.twitter.com/TEWKH5YDTn
— Shine Screens (@Shine_Screens) January 27, 2026

