Devices for Mental Health
లైఫ్‌స్టైల్

Devices for Mental Health: ఈ ప‌రిక‌రాలు మంచివే

Devices for Mental Health: తెల్లవారింది మొదలు నిద్రపోయేదాకా సిటీల్లో ఉరుకులు పరుగుల జీవితం. ఉద్యోగులు, వ్యాపారులు ఎవరైనా సరే టార్గెట్లు పూర్తిచేయాలి. ఇదే మనిషిలో తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది. ఈ ఒత్తిడికి ఆర్థిక పరమైన అంశాలు కూడా కారణమే. ఈఎంఐలు కట్టాలి. పెరుగుతున్న వడ్డీలు గుదిబండలా మారుతాయి. ధరలు పెరుగుతున్నాయి. జీతాలు పెరగవు… ఒక్కటేమిటి… సవాలక్ష ఉంటాయి. అలాగని ఒత్తిడి అనేది పెద్దలకు మాత్రమే పరిమితం కాలేదు. స్కూలు పిల్లలకూ తప్పదు. హోంవర్క్ పూర్తిచేయాలి, స్కూల్లో ఇచ్చిన ప్రాజెక్టు వర్కులు కంప్లీట్ చేయాలి. ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలి… ఇలా ప్రతీది ఒత్తిడి పెంచేదే. మన దేశంలో 89 శాతం మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు ఇటీవల సిగ్నల్ టీటీకే హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఒత్తిడే అనారోగ్యాలకు కారణమవుతోంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి. అది అంత ఈజీ కాదు. అయితే ఒత్తిడిని తగ్గించేందుకు మార్కెట్లోకి పలు స్మార్ట్ డివైసెస్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని ధరించడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందే వీలుంది. మనిషిలో ప్రెజర్ పెరుగుతున్న టైంలో ఈ స్మార్ట్ వాచ్ లు, స్మార్ట్ రింగ్ లు వంటివి అలర్ట్ చేస్తాయి. కాసేపు రిలాక్స్ కావాలంటూ సూచిస్తాయి. అవి పంపే మెసేజ్ లను ఫాలో అయితే… ఒత్తిడి హుష్ కాకియే.

ఒత్తిడిని తగ్గించే కొన్ని పరకారలు ఇవి :

Devices for Mental Health ఫిట్ బిట్ సెన్స్ : ఈ స్మార్ట్ వాచ్ ఈడీఏ సెన్సర్లతోపాటు హెచ్ఆర్వీతోనూ ఒత్తిడి స్థాయిని లెక్కిస్తుంది. ఒత్తిడితి పెరిన వెంటనే అలర్ట్ చేసి రిలాక్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇది వెరీ కామ్ దగ్గర్నుంచి వెరీ స్ట్రెస్ వరకు భావోద్వేగాల తీరును తెలుపుతుంది.

సామ్ సంగ్ గెలాక్సీ వాచ్ 4 : చిప్ తో కూడిన బయోయాక్టివ్ సెన్సర్లను జోడించిన వాచ్ లను తీసుకొస్తోంది సామ్ సంగ్. ఇది ఒత్తిడి స్థాయిలతోపాటు గురక తీరును కూడా పసిగడుతుంది.

గార్మిక్ ఇన్ స్టింక్ట్ సోలార్ 2 : వేడి, కుదుపులను తట్టుకునేలా దీన్ని తయారు చేశారు. ఇందులోని స్ట్రెస్ లెవల్ ఫీచర్ గుండె వేగం మధ్య తేడాల ఆధారంగా పనిచేస్తుంది. ఒత్తిడి బాగా పెరిగినప్పుడు తగ్గించుకోడానికి చేయాల్సిన వ్యాయామాల గురించి సూచిస్తుంది.

ధ్యాన స్మార్ట్ రింగ్ : స్మార్ట్ వాచ్ లే కాదు.. స్మార్ట్ రింగ్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. ధ్యాన స్మార్ట్ రింగ్ ను హైదరాబాద్ కు చెందిన టెక్నాలజీ కంపెనీ తయారు చేసింది. అధునాతన ఆల్గోరిథమ్ ల సాయంతో శ్వాస, ఏకాగ్రత, విశ్రాంతి వంటి వాటిని గుర్తించి మనం ఎంత బాగా ధ్యానం చేస్తున్నామో తెలుపుతుంది.

అంతేకాదు రోజులో ఎప్పుడెప్పుడు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో కూడా వివరిస్తుంది.
వీటితోపాటు ఒత్తిడిని తగ్గించే మరెన్నో స్మార్ట్ గ్యాడ్జెట్లు మార్కెట్లోకి వచ్చాయి. వాటిలోని ఫీచర్లను గుర్తించి వాడుకుంటే ఉపయోగం ఉంటుంది.

Just In

01

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు